నష్టాల ప్రారంభం
By Sakshi

రెండు రోజుల పతనం తర్వాత క్రితం రోజు స్వల్పంగా కోలుకున్న భారత్ స్టాక్ సూచీలు గురువారం తిరిగి నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 75 పాయింట్ల నష్టంతో 36,500 పాయింట్ల సమీపంలోనూ, ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 10,810 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. గత రాత్రి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పావుశాతం మేర వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ, ఈ ఏడాది ఇక రేట్ల కోత వుండబోదని సంకేతాలివ్వడంతో ఆసియా సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్ నికాయ్ 1 శాతం పెరగ్గా, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 1.1 శాతం నష్టంతో కదులుతోంది. తైవాన్ వెయిటెడ్ సూచీ స్వల్ప నష్టంతోనూ, చైనా షాంఘై, సింగపూర్ స్ర్టయిట్టైమ్స్, కొరియా కోస్పిలు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.
You may be interested
ఎఫ్‌డీఐ సవరణలు నోటిఫై
Thursday 19th September 2019న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)లకు సంబంధించి ఇటీవలి సవరణ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. కోల్ మైనింగ్, కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్, సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్‌లో ఇటీవలి నిర్ణయాలను డీపీఐఐటీ నోటిఫై చేసింది. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించే డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఎఫ్‌డీఐలకు సంబంధించిన విషయాలను చూస్తోంది. డిజిటల్ మీడియా రంగంలో 26 శాతం మేర ఎఫ్‌డీఐలను
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కి అంతర్జాతీయ గుర్తింపు
Thursday 19th September 2019ఫోర్బ్స్ ఉత్తమ బిజినెస్ స్కూళ్లలో 7వ స్థానం హైదరాబాద్: నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి గొప్ప గుర్తింపు లభించింది. ఫోర్బ్స్ ఉత్తమ బిజినెస్ స్కూల్స్ 2019 ర్యాంకుల్లో అంతర్జాతీయంగా ఐఎస్బీకి ఏడో స్థానం దక్కింది. ఏడాది ఎంబీఏ కేటగిరీలో ఆసియా వ్యాప్తంగా అత్యుత్తమ బి-స్కూల్‌గా గుర్తింపునకు నోచుకుంది. ఫోర్బ్స్ ర్యాంకుల్లో ఐఎస్బీకి చోటు లభించడం ఈ ఏడాదే మొదటి సారి. ప్రతీ రెండేళ్లకు ఒకసారి అంతర్జాతీయంగా అత్యుత్తమ బి