News


సెన్సెక్స్‌ 400, నిఫ్టీ 128 పాయింట్లు హైజంప్‌

Thursday 9th January 2020
Markets_main1578541228.png-30782

ఒక్కసారిగా అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు చల్లబడటంతో గురువారం భారత్‌ స్టాక్‌ సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 401 పాయింట్లు జంప్‌చేసి 41,219 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 128 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,153 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ఇరాన్‌తో యుద్ధానికి దిగబోమని, ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత రాత్రి చేసిన ప్రకటనతో అమెరికాలో నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు కొత్త రికార్డుల్ని సృష్టించడంతోపాటు తాజాగా ఆసియా సూచీలు జోరుగా పెరిగాయి. మరోవైపు క్రూడ్‌ ధర పతనంకావడం కూడా ఈక్విటీ మార్కెట్లకు కలిసివచ్చింది. 



You may be interested

త్వరలో పీసీఏ నుంచి బైటపడతాం

Thursday 9th January 2020

ఐవోబీ ఎండీ కరణం శేఖర్‌ ధీమా మొండిబాకీల రికవరీపై కసరత్తు ఎంఎస్‌ఎంఈ, రిటైల్‌ రుణాలపై మరింత దృష్టి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొండిబాకీల రికవరీకి, నిర్వహణ మెరుగుపర్చుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టగలమని ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐవోబీ) ఎండీ, సీఈవో కరణం శేఖర్‌ తెలిపారు. తద్వారా సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ)పరమైన ఆంక్షల పరిధి నుంచి త్వరలోనే బైటపడగలమని ఆయన

మ్యూచువల్‌ ఫండ్‌ ఏయూఎంలో 2% తగ్గుదల

Thursday 9th January 2020

గతనెల్లో రూ. 61,810 కోట్ల ఉపసంహరణ రూ. 26.54 లక్షల కోట్లకు మొత్తం నిర్వహణ ఆస్తి  రుణ-ఆధారిత పథకాల్లో భారీగా విక్రయాలు న్యూఢిల్లీ: డిసెంబర్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు తగ్గుదలను నమోదుచేశాయి. అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) విడుదల చేసిన తాజా సమాచారం ‍ప్రకారం.. గత నెల్లో రూ. 61,810 కోట్ల ఉపసంహరణ చోటుచేసుకుంది. దీంతో ఈ పరిశ్రమలోని 44 సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2 శాతం తగ్గి

Most from this category