News


11800 పాయింట్ల దిగువన నిఫ్టీ

Saturday 1st February 2020
Markets_main1580544298.png-31401

దేశీయ స్టాక్‌ ఎక్చేంజ్‌లు బడ్జెట్‌ రోజు తీవ్ర నష్టాలోకి జారాయి. మార్కెట్‌ ఆశించినట్లు ఎల్‌టీసీజీపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో సూచీలు భారీ నష్టాల్లోకి మరలాయి. నిఫ్టీ 11800 పాయింట్ల మద్దతు కోల్పోయి 11741 పాయింట్ల కనిష్టానికి చేరింది. సెన్సెక్స్‌ దాదాపు 40వేల పాయింట్ల వద్దకు చేరింది. ఐటీ మినహాయింపులు, ఎల్‌ఐసీ ఐపీఓ, డీడీటీ ఎత్తివేత లాంటివి మార్కెట్‌ను పెద్దగా రంజింపజేయలేకపోయాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉండడం కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే!



You may be interested

1.2 శాతం పెరిగిన ఎస్కార్ట్‌ విక్రయాలు

Saturday 1st February 2020

న్యూఢిల్లీ: జనవరి నెలలో వాహన విక్రయాలు 1.2 శాతం పెరిగాయని ఎస్కార్ట్స్‌ కంపెనీ ప్రకటించింది. ఈ జనవరిలో 6,063 ట్రాక్టర్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది జనవరిలో 5,991 ట్రాక్టర్లను మాత్రమే అమ్మినట్లు కంపెనీ బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. కాగా దేశీయ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 1.4 శాతం పెరగడంతో 5,845 ట్రాక్టర్లను విక్రయించినట్లు పేర్కొంది. ఎగుమతులు 5 శాతం పడిపోవడంతో కేవలం 218 ట్రాక్టర్లను విక్రయించామని, గతేడాది

1.6 శాతం పెరిగిన మారుతి విక్రయాలు

Saturday 1st February 2020

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద​ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా కార్ల విక్రయాలు జనవరిలో 1.6 శాతం పెరిగాయని ప్రకటించింది. దీనిలో భాగంగా 1,51,721 యూనిట్ల  అమ్మకాలు జరిగాయని మారుతి సుజుకీ అధికారికంగా ప్రకటించింది. దేశీయంగా 1.7 శాతం విక్రయాలు పెరగడంతో 2018 జనవరిలో  1,42,150 యూనిట్లు అమ్మగా, ఈ ఏడాది జనవరిలో 1,44,499 యూనిట్లు విక్రయించామని తెలిపింది. ఆల్టో, వ్యాగన్‌ఆర్‌ కార్ల విక్రయం గతేడాదితో పోలిస్తే 11

Most from this category