News


సెన్సెక్స్‌ 1739 పాయింట్లు , నిఫ్టీ 510 పాయింట్లు క్రాష్‌..!

Thursday 12th March 2020
Markets_main1583986587.png-32420

10వేల మార్కును కోల్పోయిన నిఫ్టీ  
34వేల దిగువన ప్రారంభమైన సెన్సెక్స్‌
5-7శాతం నష్టపోయిన ప్రధాన ఇండెక్స్‌లు 

కరోనా వైరస్‌ వ్యాధి భయాలు మరోసారి భారత స్టాక్‌ మార్కెట్‌ను ముంచేశాయి. ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్‌ గురువారం ఏకంగా 5శాతం నష్టంతో మొదలైంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 34వేల మార్కును, నిఫ్టీ 10వేల మార్కును కోల్పోయాయి. సూచీలైన సెన్సెక్స్‌ 1739 పాయింట్ల నష్టంతో 33958 వద్ద, నిఫ్టీ 510 పాయింట్లను కోల్పోయి 9, 948 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దాదాపు 110 దేశాలకు విస్తరించిన కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రపంచ అంటువ్యాధిగా గుర్తిస్తున్నామని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్లూ‍్యహెచ్‌ఓ) ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని సైతం ప్రకటిస్తున్నట్టు ఈ సందర్భంగా డబ్లూ‍్యహెచ్‌ఓ తెలిపింది. మొత్తం 114 దేశాల్లో 1.18 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకూ 4,291 మంది మరణించారని తెలిపింది. 2009లో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ)ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన తరువాత, డబ్ల్యూహెచ్ఓ మరో వ్యాధిని ఇంత తీవ్రంగా పరిగణించడం ఇదే తొలిసారి.

కరోనా వైరస్‌ వ్యాధి ధాటికి ఆర్థిక అగ్రరాజ్యమైన అమెరికా స్టాక్‌ మార్కెట్‌ పూర్తిగా బేర్‌ గుప్పిట్లో వెళ్లిపోవడంతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్-19 వ్యాధిని అంటువ్యాధిగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు చిగురుటాకులా వణికుతున్నాయి. నిన్నరాత్రి అమెరికా స్టాక్‌ సూచీలైన డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 6-5 శాతం మధ్య క్షీణించాయి. నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లన్నీ తీవ్ర నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

దేశీయ పరిణామాల విషయానికొస్తే... ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ మునుపటి ముగింపు(73.63)తో పోలిస్తే ఏకంగా 62 పైసలు పోలిస్తే 74.25 వద్ద ప్రారంభమైంది. నేడు జనవరి నెల పారిశ్రామికోత్పత్తి, ఫిబ్రవరి  రిటైల్‌ ద్రవ్యోల్బణం డేటా విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహిస్తున్నారు. అలాగే దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐల పెట్టుబడులు వెనక్కితీసుకోవడం కొనసాగుతోంది. 

ఉదయం గం.9:30ని.కు సెన్సెక్స్‌ 1647.54 పాయింట్ల నష్టంతో 34049.86  వద్ద, నిఫ్టీ 500 పాయింట్లను కోల్పోయి 9961.30  వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్ని రంగాలకు చెందిన ప్రధాన ఇండెక్స్‌లన్నీ 5శాతం నుంచి 7శాతం వరకు నష్టాన్ని చవిచూశాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 5.50శాతం నష్టంతో 26వేల మార్కును కోల్పోయి 25,090.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 


నిఫ్టీ -50 ఇండెక్స్‌లో ఏ ఒక్క షేరు కూడా లాభపడలేదు. ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, యస్‌బ్యాంక్‌, టాటా మోటర్స్‌ షేర్లు 8శాతం నుంచి 11శాతం నష్టపోయాయి. You may be interested

యూరప్‌ దేశాలకు నో ఎంట్రీ..ట్రంప్‌!

Thursday 12th March 2020

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యూరప్‌ దేశాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణీకులపై నిషేధం విధించారు. చైనాలో పుట్టిన కోవిడ్‌-19(కరోనా వైరస్‌) చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తుండడం, అమెరికాలో వేగంగా విస్తరిస్తుండండంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం రాత్రి అమెరికా దేశ ప్రజలనుద్దేశించి టీవీలో మాట్లాడిన సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌  వెల్లడించారు. మరో నెలరోజులవరకు(30 రోజులు) యూరప్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అమెరికాలోకి

ట్రంప్‌ టాక్స్‌ కట్స్‌పై అనిశ్చితి- యూఎస్‌ పతనం

Thursday 12th March 2020

6 శాతం దిగజారిన డోజోన్స్‌ 5 శాతం చొప్పున పడిన ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ ఆసియా మార్కెట్లు 7-3 శాతం మధ్య డీలా  నేడు యూరోపియన్‌ మార్కెట్లు బోర్లా? తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను విశ్వ వ్యాధి(పాండెమిక్‌)గా గుర్తించడంతో బుధవారం మరోసారి అమెరికా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. మరోవైపు కరోనా ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రణాళికల్లో స్పష్టత లోపించడంతో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి డోజోన్స్‌ 1,465 పాయింట్లు(5.9 శాతం) కుప్పకూలి

Most from this category