News


అసెంబ్లీ ఫలితాల ఎఫెక్ట్‌...గ్యాప్‌అప్‌ ప్రారంభం

Thursday 24th October 2019
Markets_main1571888293.png-29099

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతున్నట్లు తొలి ట్రెండ్స్‌ ద్వారా వెల్లడికావడంతో గురువారం మార్కెట్‌ గ్యాప్‌అప్‌తో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 164 పాయింట్ల లాభంతో 39,223 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 58  పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,662 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. క్రితం రోజు ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో పాటు బోనస్‌ ఇష్యూను ప్రకటించిన హెచ్‌సీఎల్‌ టెక్‌ 5 శాతం లాభంతో రూ. 1,155 వద్ద మొదలయ్యింది. అలాగే అంచనాల్ని మించిన ఫలితాల్ని వెల్లడించిన లార్సన్‌ అండ్‌ టూబ్రో 2.5 శాతం గ్యాప్‌అప్‌తో మొదలయ్యింది. యస్‌బ్యాంక్‌, టెక్‌ మహింద్రా, టైటాన్‌ షేర్లు 1-2 శాతం మధ్య లాభంతో మొదలయ్యాయి. 



You may be interested

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Thursday 24th October 2019

నేడు ఈ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు ఫలితాలు వెల్లడించున్నాయి. ఐటీసీ, మారుతీ సుజుకీ,  పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌(ఇండిగో), ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌, ఇక్రా, కాల్గేట్‌ పామోలివ్‌, రేమండ్‌, అలెంబిక్‌ ఫార్మా, కమ్మిన్స్‌ ఇండియా, ఎన్‌ఐఐటీ, రియలన్స్‌ నిప్పన్‌ అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌, గుజరాత్‌ స్టే్‌ట్‌ ఫెర్టిలైజర్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కాయ, యూనిటెడ్‌ స్పిరిట్స్‌, పరాగ్‌ మిల్క్స్‌, ఇక్రా, రిలయన్స్‌ నావెల్‌

6.1 నుంచి 7 శాతానికి వృద్ధిరేటు

Thursday 24th October 2019

భారత్‌పై ఐఎంఎఫ్‌ అంచనా సింగపూర్‌: భారత్‌ ఆర్థిక వృద్ధిరేటు 2020-2021లో కొంత మెరుగుపడుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఆసియా పసిఫిక్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ జోనథన్‌ ఆస్రా‍్టయ్‌ విశ్లేషించారు. ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2019-20లో భారత్‌ వృద్ధి రేటు కేవలం 6.1 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. 2020-21లో ఇది 7 శాతానికి మెరుగుపడుతుందన్నది ఐఎంఎఫ్‌ అంచనా అని తెలిపారు. ఒకపక్క కేంద్రం తీసుకున్న కార్పొరేట్‌ పన్ను కోత నిర్ణయం,

Most from this category