News


గ్యాప్‌అప్‌ ప్రారంభం

Friday 25th October 2019
Markets_main1571974848.png-29128

అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా వున్నప్పటికీ, శుక్రవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 181 పాయింట్ల లాభంతో 39,201 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 63 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,646 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. క్రితం రోజు రికార్డు లాభాల్ని ప్రకటించిన ఐటీసీ 2.5 శాతం గ్యాప్‌అప్‌తో మొదలుకాగా, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, ఐఓసీలు 1-2 శాతం మధ్య లాభపడ్డాయి. టెల్కోలకు సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్‌ ఫలితంగా ఇన్‌ఫ్రాటెల్‌ ప్రారంభంలో 5 శాతం నష్టపోయింది. గ్రాసిమ్‌, టెక్‌ మహింద్రా, ఓఎన్‌జీసీలు 1-2 శాతం మధ్య నష్టాలతో మొదలయ్యాయి. 



You may be interested

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కంపెనీలు

Friday 25th October 2019

టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, మ్యారికో, అర్‌వింద్‌, టాటా కాఫీ, హికాల్‌, ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌, జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రత్నమని మెటల్స్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌, సుప్రీం ఇండస్ట్రీస్‌, వీ2రిటైల్‌, జువారి ఆగ్రో కెమికల్స్‌, మారికో, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ 

జీఎస్‌టీ సరళీకరణతో ర్యాంక్‌ మెరుగుపరుస్తాం: నిర్మల

Friday 25th October 2019

వస్తు, సేవల పన్నును మరింత సరళతరం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యమైన అగ్ర స్థాయి 50 దేశాల జాబితాలోకి చేరుకోవడానికి వీలుంటుందని వివరించారు. జీఎస్‌టీని సులభతరం చేయడం అనేది కొనసాగుతున్న ప్రక్రియ కాగా, ప్రస్తుతం రిటర్నుల ఆన్‌లైన్ ఫైలింగ్‌లో ఉన్నటువంటి అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ, ముంబై నగరాలను ఆధారంగానే ప్రపంచ బ్యాంక్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌

Most from this category