News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Wednesday 16th October 2019
Markets_main1571198131.png-28912

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ఫలితంగా బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 125 పాయింట్ల లాభంతో 38,637 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్ల పెరుగుదలతో 11,465 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. బీపీసీఎల్‌ 5 శాతం గ్యాప్‌అప్‌తో ట్రేడింగ్‌ను ఆరంభించగా, జీ టెలి, గ్రాసిమ్‌, బజాజ్‌ ఫైనాన్స్, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 1-2 శాతం మధ్య లాభపడగా, వేదాంత, ఐషర్‌ మోటార్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, అదానిలు 1-2 శాతం మధ్య క్షీణించాయి. 



You may be interested

రూపీ 31 పైసలు డౌన్‌

Wednesday 16th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం 5 పైసలు బలహీనపడి 71.59 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా మధ్య తాజాగా జరుగుతున్న పరిణామాల వలన డాలర్‌ కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా రూపీ డాలర్‌ మారకంలో గత సెషన్‌లో 31 పైసలు బలహీనపడి 71.54 వద్ద ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు అర శాతానికి పైగా పడిపోవడంతో పాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో రూపీ పతనం తగ్గింది. యుఎస్‌-చైనా

7% కాదు... 6.1 శాతమే!

Wednesday 16th October 2019

2019 భారత్‌ వృద్ధిరేటుకు ఐఎంఎఫ్‌ కోత ఆటోమొబైల్‌, రియల్టీసహా  పలు రంగాలు ప్రతికూలం నాన్‌-బ్యాంక్‌ ఫైనాన్షియల్‌  కంపెనీల పరిస్థితీ అనిశ్చితే! వాషింగ్టన్‌: భారత్‌ ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను తగ్గిస్తున్న పలు సంస్థల జాబితాలో తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) కూడా చేరింది. 2019లో వృద్ధి కేవలం 6.1 శాతంగానే నమోదవుతుందని తన వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఏప్రిల్‌ అంచనా (7.3 శాతం)తో పోల్చితే తాజా అంచనా ఏకంగా 1.2 శాతం తక్కువ. నిజానికి ఏప్రిల్‌లో

Most from this category