STOCKS

News


చివరి గంటలో కొనుగోళ్లు

Wednesday 4th December 2019
Markets_main1575456185.png-30056

  •  ట్రేడ్‌డీల్‌ కుదరొచ్చన్న వార్తలు
  • 175 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌
  • 12,000 పైన ముగిసిన నిఫ్టీ 

మార్కెట్‌ చివరి గంటలో అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే వార్తలు అనూహ్యంగా తెరపైకి రావడంతో మార్కెట్‌ బుధవారం లాభంతో ముగిసింది. బ్యాంకింగ్‌, మెటల్‌ రంగ షేర్ల దన్నుతో సెన్సెక్స్‌ 175 పాయింట్లు పెరిగి 40850 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 12వేల పైన 12,037.30 వద్ద స్థిరపడింది. , రేపు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటన చేయవచ్చన్న ఆశలతో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల డిమాండ్‌ నెలకొంది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.10శాతం లాభపడి 31,962 వద్ద స్థిరపడింది. వాటితో పాటు ఐటీ, ఆర్థిక, ఫార్మా, మీడియా, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు లాభపడ్డాయి. అయితే ఒక్క రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని అధిగమించలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలతో నేడు మార్కెట్‌ నష్టాలతో మొదలైంది. మిడ్‌సెషన్‌ వరకు సూచీల ర్యాలీకి మద్దతునిచ్చే అంశాలేవి లేకపోవడంతో మార్కెట్లో అమ్మకాలు జరిగాయి. ఒకదశలో సెన్సెక్స్‌ 200 పాయింట్లు నష్టపోయి 40,476 వద్ద, నిఫ్టీ 68పాయింట్లను కొల్పోయి 11,935.30 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదుచేశాయి. ఫేజ్-వన్ వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇరుదేశాలు ఇదివరకు విధించుకున్న సుంకాలను వివిధ దశల్లో ఉపసంహరించుకునే దిశగా ఒప్పందాల్ని కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యాయని బ్లూమ్‌బెర్గ్ బుధవారం ఓ వార్తకథనాన్ని వెలువరించింది. మరోవైపు ఇదే వాణిజ‍్య చర్చలు విజవంతం వార్తలతో యూరప్‌ మార్కెట్లు సైతం లాభాల బాటపట్టాయి. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా కొనుగోళ్ల పర్వం మొదలైంది. సెన్సెక్స్‌ కనిష్టస్థాయి 40,476 నుంచి 409 పాయింట్లు పెరిగి 40,886.87 ‍వద్ద ఎగిసింది. నిఫ్టీ 119 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. 

హిందాల్కో, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, టాటామోటర్స్‌ షేర్లు 2.60శాతం నుంచి 7శాతం లాభపడ్డాయి. బజాజ్‌ ఫిన్స్‌ సర్వీసెస్‌, ఐఓసీ, కోల్‌ ఇండియా, రిలయన్స్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ షేర్లు 1శాతం​నుంచి 2.20శాతం నష్టపోయాయి. 
 You may be interested

ఈ స్టాక్స్‌లో రాబడులకు చాన్స్‌..!

Thursday 5th December 2019

ప్రభుత్వం ప్రకటించిన పలు ప్రోత్సాహక చర్యలు, ఇతర సానుకూల అంశాల ఆధారంగా ఈక్విటీ మార్కెట్లు అధిక బేస్‌ దిశగా అడుగులు వేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు గత రెండు నెలల్లో కొనుగోళ్లు చేస్తుండడం కూడా కలిసొస్తోంది. అటు ఎఫ్‌ఐఐలు, ఇటు డీఐఐల పెట్టుబడులతో నూతన గరిష్టాలకు మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. కొన్ని అధిక వెయిటేజీ స్టాక్స్‌తో ప్రస్తుత ర్యాలీ నడుస్తోందని, ఇది తదుపరి ఆర్థిక సంవత్సరానికి కూడా

ఎకానమీలో రికవరీతో లాభపడే షేర్లివే!

Wednesday 4th December 2019

ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌ మెరుగుపడితే ముందుగా లాభపడే టాప్‌ షేర్లను కోటక్‌ సెక్యూరిటీస్‌, ట్రేడింగ్‌ బెల్స్‌, సిటిగ్రూప్‌ తదితర బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.  1. ఎస్‌బీఐ: బ్యాంకు లోన్‌బుక్‌లో 30 శాతం వాటా రిటైల్‌ విభాగానిదే. హోమ్‌లోన్స్‌తో లోన్‌బుక్‌ మంచి వృద్ధి నమోదు చేస్తోంది. వడ్డీ వ్యయాల తగ్గింపు, లోన్‌ గ్రోత్‌, బలమైన ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ గ్రోత్‌తో రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో రిటర్న్‌ రేషియో మరింత మెరుగుపడుతుందని అంచనా.  2. ఐసీఐసీఐ బ్యాంక్‌:

Most from this category