News


2020ఏడాది కనిష్టానికి సూచీలు..!

Thursday 27th February 2020
news_main1582787613.png-32140

ప్రపంచ ఈక్వీటీ మార్కెట్లలో కరోనా వైరస్‌ వ్యాధి భయాలకు,  ఫిబ్రవరి ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ కాంటాక్టు ముగింపు నేప‌థ్యంలో ఇన్వెస్టర్ల అప్రమ‌త్తత తోడవ్వడంతో గురువారం బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు ఈ 2020 ఏడాది కనిష్టం దిగువకు చేరుకున్నాయి. మిడ్‌సెషన్‌ కల్లా సెన్సెక్స్‌ సెన్సెక్స్‌ 465పాయింట్లు నష్టపోయి 39,423.27 వద్ద, నిఫ్టీ 141 పాయింట్లను కోల్పోయి 11,536 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. కేంద్ర బడ్జెట్‌ సమర్పణ తర్వాత ఫిబ్రవరి 3 నాటి కనిష్టస్థాయి దిగువకు సూచీలు పడిపోవడం ద్వారా ఈ కొత్త ఏడాదిలో మార్కెట్‌ మరో కొత్త కనిష్టాన్ని చవిచూసినట్లయ్యింది.  ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌కు కీలకమైన 30 ,000 స్థాయిని కోల్పోయింది. మధ్యాహ్నం గం.12:00లకు సెన్సెక్స్‌ క్రితం ముగింపు(39,888.96)తో పోలిస్తే 365.46 పాయింట్లను కోల్పోయి 39,523.50 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ గత ముగింపు(11,678.50)తో పోలిస్తే 110 పాయింట్లు కోల్పోయి 11,568.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నష్టపోతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరగడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయి 30వేల దిగువన 29,989 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. మార్కెట్‌ ఇప్పటికే చాలా కరెక‌్షన్‌కు లోనైంది. రానున్న రోజుల్లో మరింత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. దేశీయ ఆర్థిక వృద్ధిలో మెరుగుదల ఉందో లేదో అనే అంశాన్ని తెలియజేసే ఈ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలు జీడీపీ గణాంకాల రేపు(శుక్రవారం) విడుదల కానున్నాయి. జీడీపీ గణాంకాల బట్టి మార్కెట్‌ తదుపరి మూమెంట్‌ ఉండవచ్చు అని ఐడీబీఐ క్యాపిటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఏకే ‍ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు.

ఇండస్‌ఇండ్‌, సిప్లా, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, విప్రో షేర్లు 2.50శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. మారుతి, ఇన్ఫ్రాటెల్‌, సన్‌ఫార్మా, టైటాన్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు అరశాతం నుండి 3.50శాతం లాభపడ్డాయి. You may be interested

52 వారాల కనిష్టానికి 233 షేర్లు

Thursday 27th February 2020

గురువారం 233 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, A2Z ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఏబీబీ ఇండియా, అగ్రిటెక్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, అలికాన్‌ క్యాస్ట్‌లాయ్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అంబికా కాటన్‌ మిల్స్‌, ఆంధ్రా బ్యాంక్‌, ఆంధ్రా పేపర్‌, అపార్‌ ఇండస్ట్రీస్‌, ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆరో గ్రీన్‌టెక్‌, అర్షియా, ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లీస్‌, అసోసియేటెడ్‌ ఆల్కాహాల్స్‌ అండ్‌ బ్రూవరీస్‌, ఆటోమోటివ్‌ యాక్సెలెస్‌,

సిమెంట్‌ స్టాకులపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 27th February 2020

సిమెంట్‌ రంగంలోని కంపెనీల షేర్లపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. దేశవ్యాప్తంగా సిమెంట్‌ వినియోగం పెరగడం, తద్వారా కంపెనీల లాభాలు పెరుగుతాయన్న అంచనాలతో సిమెంట్‌స్టాకులపై బ్రోకింగ్‌ సంస్థలు పాజిటివ్‌గా మారాయి. కొత్త ఆర్థిక సంవత్సరం దేశీయంగా క్లింకర్‌ వినియోగం 80 శాతాన్ని దాటుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. దీంతో ఎబిటా పెరుగుదల ఆధారిత ధరల వృద్ధి నమోదవుతుందని తెలిపింది. పాజిటివ్‌ అంచనాలతో సిమెంట్‌ ధరలు స్థిరంగా ఉంటాయని, జనవరి- జూన్‌

Most from this category