News


క్యూ3లో ఆర్థికవ్యవస్థ బాటమ్‌ఔట్‌: సీఎల్‌ఎస్‌ఏ

Wednesday 13th November 2019
Markets_main1573638745.png-29559

ఆర్థిక వ్యవస్థ డిసెంబర్‌ త్రైమాసికంలో బాటమ్‌ ఔట్‌ అవుతుందని, అటుతర్వాత వీ-ఆకారపు రికవరీ వుండకపోవొచ్చని సీఎల్‌ఎస్‌ఏ ఇండియా, స్ట్రాటజిస్ట్‌, మహేష్‌ నందుర్కర్‌ అన్నారు. ఆర్‌బీఐ ద్రవ్య విధానాలను సరళతరం చేయడంతో లిక్విడిటీ లభ్యత పెరిగిందని, అదేవిధంగా రుణాలను అధికంగా ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడం, వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం, బ్యాంకులకు ప్రభుత్వం మూలధనాన్ని సమకూర్చడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థ రికవరికి తోడ్పాటునందిస్తున్నాయని అన్నారు. వీటితో పాటు తక్కువ బేస్‌ ఉండడం కూడా ఆర్థిక వ్యవస్థ రికవరికి సహాయపడుతుందన్నారు.
    తాజాగా షేరు ధరలు పెరగడంతో వాల్యుషన్‌ పరంగా ఆందోళనలున్నప్పటికి, బీమా, పెద్ద తనాఖా కంపెనీలు వంటి రుణేతర ఆర్థిక సంస్థలంటే  తమకు ఇష్టమని నందుర్కర్‌ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రికవరీ ఎప్పుడవుతుందనేది అంతుపట్టడం లేదని, కానీ అమ్ముడికాని నిల్వలు తగ్గుతుండడంతోపాటు, గృహాలు మరింత సరసమైన ధరలలో లభిస్తుండడంతో హౌసింగ్‌ విభాగంలో రికవరీ ఉంటుందని అభిప్రాయపడ్డారు.  ఆటోరంగంలో మందగమనం గురించి అధికంగా మాట్లాడుతున్నారని, కానీ 2012 నుంచి చూస్తే ఇండియా ఆటో రంగం వృద్ధి కేవలం 3 శాతం సీఏజీఆర్‌(కాంపౌండ్‌ యాన్యుల్‌ గ్రోత్‌ రేట్‌) మాత్రమే పెరిగిందని అన్నారు. తక్కువ బేస్‌ ప్రభావంతోపాటు, రుణాల రేట్లు సరళతరమవ్వడం, బీఎస్‌ 6 నిబంధనలు అమలులోకి వచ్చే ముందు ఆటో సెక్టార్‌లో అమ్మకాలు పెరగడం వంటి అంశాల వలన ఆటో సెక్టార్‌ కొంత ఆకర్షణీయంగా కనిపిస్తోందని అన్నారు. టెలికాం సెక్టార్‌ కన్సాలిడేషన్‌ దశలో ఉందని తెలిపారు. ‘ గత 3-4 ఏళ్ల కాలాన్ని గమనిస్తే టెలికాం రంగంలో మనం బాటమ్‌ ఔట్‌కు దగ్గరగా ఉన్నామనిపిస్తోంది’ అని అభిప్రాయపడ్డారు. ఏజీఆర్‌కు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు వలన టెలికాం రంగం ఒత్తిడిలో ఉందని అన్నారు. 
   దేశీయ ఆర్థిక వృద్ధి అధికంగా వినియోగ ఆధారితమని, ప్రభుత్వం భవిష్యత్తు వృద్ధి కోసం పెట్టుబడి ఆధారిత వృద్ధికి పునాది వేసిందని అభిప్రాయపడ్డారు. కేవలం కొన్ని లార్జ్‌క్యాప్‌లలో అధికంగా జరిగే మార్కెట్‌ యాక్షన్‌, ప్రస్తుతం విస్తృతమవుతోంది. ‘ స్థూల ఆర్థిక డేటా ప్రతికూలంగా ఉంటే, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లలోకి వచ్చే నిధుల ప్రవాహాం ఆగిపోతుంది’ అని అన్నారు. 



You may be interested

ఫండ్స్‌ కొన్న షేర్లివే!

Wednesday 13th November 2019

దేశీయ స్టాక్‌ ఫండ్లలోకి నిధుల ప్రవాహం వరుసగా రెండో నెల తగ్గుముఖం పట్టింది.  యాంఫీ గణాంకాలు ప్రకారం ఈ అక్టోబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రూ.60.2 బిలియన్ల నిధులు వచ్చాయి. సెప్టెంబర్‌లో వచ్చిన నిధులతో పోలిస్తే ఇది 9శాతం తక్కువ. అలాగే మే తరువాత అతి తక్కువగా నిధుల వచ్చిన నెల అక్టోబరే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశంలో టాప్‌-3 మ్యూచువల్‌ ఫండ్‌  హౌసింగ్‌లు ఏ షేర్లకు కొన్నాయా, వేటిని విక్రయించాయో ఇప్పుడు

88 షేర్లలో సెల్‌ సిగ్నల్స్‌!

Wednesday 13th November 2019

దేశీయ సూచీలు ఒకరోజు విరామం అనంతరం బుధవారం పాజిటివ్‌గా ఆరంభమై మధ్యాహ్నాన సమయానికి నెగిటివ్‌ జోన్‌లోకి జారాయి. మరోవైపు సోమవారం ముగింపు ప్రకారం 88 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో టాటా పవర్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌, కాస్ట్రాల్‌ ఇండియా, శ్రీరామ్‌

Most from this category