News


జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు

Saturday 29th June 2019
Markets_main1561781608.png-26676

 

  • 426.416 బిలియన్ డాలర్లకు చేరిక
  • వచ్చే 10నెలల దిగుమతులకు ఢోకాలేని స్థాయి

ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది జూన్‌ 21తో ముగిసిన వారంలో ఏకంగా 4.215 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 426.416 బిలియన్ డాలర్లకు ఎగశాయి. గణనీయంగా పెరిగిన విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండడం వంటి సానుకూల అంశాలు ఇందుకు సహకరించాయి. గతేడాది ఏప్రిల్ 13న  విదేశీ మారక నిల్వలు 426.028 బిలియన్ డాలర్లకు చేరి జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసిన విషయం తెలిసిందే కాగా, ఆర్‌బీఐ అతి జోక్యం కారణంగా ఈసారి అంతకుమించి నమోదయ్యాయి. తాజా నిల్వలు వచ్చే 10నెలల దిగుమతులకు సరిపడేంత స్థాయిలో ఉన్నాయని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ఈమేరకు నిల్వలు ఉండాలని విశ్లేషించారు. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగంగా డాలర్ల రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 4.202 బిలియన్ డాలర్లు పెరిగి 398.649 బిలియన్ డాలర్లకి చేరాయి. (అమెరికా డాలర్ మినహాయించి మిగిలిన కరెన్సీలైన యూరో, పౌండ్, యెన్ వంటి ఇతర నిల్వల పెరుగుదల/తరుగుదలను డాలర్లలోనికి మార్చి లెక్కిండాన్నే ఎఫ్సీఏగా వ్యవహరిస్తారు.) బంగారం నిల్వలు ఎటువంటి మార్పులులేకుండా 22.958 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా.. అంతర్జాతీయంగా ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 4.2 మిలియన్ డాలర్లు పెరిగి 1.453 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 



You may be interested

ఆసియా టాప్‌-20 ఖరీధైన నగరాల్లో ‘ముంబై’

Saturday 29th June 2019

మెర్సెర్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: ఆసియాలోని టాప్‌-20 ఖరీధైన నగరాల జాబితాలో ముంబై చోటు దక్కించుకుంది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారికి ఈ నగరం అత్యంత ఖరీధైనదని గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సంస్థ మెర్సెర్ తన నివేదికలో పేర్కొంది. ఇక అత్యధిక నివాస గృహాల ధరలను కలిగిన సిటీల్లో ప్రపంచ స్థాయి రికార్డును నెలకొల్పినట్లు తెలిపింది. జీవన వ్యయంపై ఈ సంస్థ 209 నగరాల్లో సర్వే నిర్వహించగా.. ముంబై 67వ స్థానంలో

ట్రావెల్‌ టికెట్ల కోసం జియోబస్‌ (స్టార్టప్‌ డైరీ)

Saturday 29th June 2019

బస్, విమాన టికెట్లతో పాటు హోటల్స్, క్యాబ్స్‌  నెలకు 8 వేల టికెట్లు; రూ.5 లక్షల ఆదాయం  ఏడాదిలో యుటిలిటీ బిల్స్, నగదు బదిలీ సేవల్లోకి ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ మురళీ కృష్ణ హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: బస్, రైలు, విమాన టికెట్ల బుకింగ్‌ సేవల్లోకి మరో తెలుగు కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘జియోబస్‌.ఇన్‌’ ప్రయాణ టికెట్లతో పాటు హోటల్స్, క్యాబ్స్‌ బుకింగ్స్, హాలిడే ప్యాకేజెస్, రీచార్జ్‌ వంటి ఇతర సేవలను కూడా అందిస్తుంది.

Most from this category