News


రియల్టీ సంక్షోభం..సంపన్నుల రుణ చెల్లింపులపై అనుమానాలు!

Thursday 22nd August 2019
Markets_main1566457549.png-27945

గత ఏడాది ప్రారంభమైన ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం రుణ మార్కెట్‌లో ఉన్న పెద్ద వ్యాపారవేత్తలను కూడా విడిచి పెట్టడంలేదు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న రియల్టీ మందగమనం వలన ఈ రంగంతో ముడిపడి ఉన్న అజయ్‌ పిరమల్‌, పల్లోంజి మిస్త్రీ,  మంగల్‌ ప్రభాత్‌ లోధా(బీజేపీ ముంబై యూనిట్‌ అధ్యక్షుడు) వంటి భారతీయ సంపన్న వ్యాపారవేత్తలు ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  వ్యాపార వాతావరణం అధ్వాన్నంగా తయారవ్వడంతో పాటు ఫండింగ్‌ ఖర్చులు పెరగడంతో, ఈ వ్యాపారవేత్తలకు చెందిన కొన్ని కంపెనీల రేటింగ్‌లను అనేక బ్రోకరేజి సంస్థలు ఇప్పటికే తగ్గించాయి. అంతేకాకుండా ఈ వ్యాపారవేత్తల రుణ చెల్లింపులపై బ్రోకరేజి సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

    ‘ఈ వ్యాపారవేత్తల రుణ చెల్లింపు సామర్ధ్యం క్షీణిస్తుండడం వలన వీరికి చెందిన కంపెనీల రుణాలు, రేటింగ్‌ వంటి అంశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది’ అని సెంట్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సందీప్ ఉపాధ్యాయ్ అన్నారు. లిక్విడిటీ కొరత అధికంగా ఉండడంతో పాటు ప్రాపర్టీ వ్యాపారాల ప్రదర్శన అధ్వాన్నంగా ఉండడం వలన ఈ కంపెనీల రేటింగ్‌లు డౌన్‌ గ్రేడ్‌ అవుతున్నాయని తెలిపారు.  జూన్‌ క్యార్టర్లో భారతదేశ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని అనేక బ్రోకరేజి సంస్థలు అంచనా వేశాయి. కానీ ఈ అంచనా గత కొన్నేళ్ల నుంచి జూన్‌ క్యార్టర్‌లో నమోదవుతున్న వృద్ధి 7-8 శాతాని కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. ఫలితంగా ఇప్పటికి కూడా రుణ మార్కెట్‌లో ఇబ్బందులున్నాయనే విషయం స్పష్టమవుతుందని పరిశీలకులు తెలిపారు.

మంగల్ ప్రభాత్ లోధా, మాక్రోటెక్‌ వ్యవస్థాపకుడు: 
లిక్విడిటీ కొరత అధికంగా ఉండడంతో భారతదేశ సంపన్న ఆస్తి వ్యాపారవేత్త మంగల్‌ ప్రభాత్‌ లోధా స్థాపించిన మాక్రోటెక్‌ డెవలపర్స్‌ సంస్థ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ సంస్థ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌, ఫిచ్‌ రేటింగ్స్‌ ఈ నెల తగ్గించాయి. అంతేకాకుండా రాబోయే రుణ మెచ్యూరిటీలను రీఫైనాన్స్ చేయడంలో తగినంత పురోగతి లేకపోవడం కూడా ఆందోళన కలిగించే అంశమని మూడీస్‌ తెలిపింది. వీటితోపాటు ఈ సంస్థ లండన్‌లోని ఆస్తులను నగదుగా మార్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాగా సంస్థకు రూ. 19,000 కోట్ల రుణాలుండగా, వివిధ ప్రాజెక్టుల నుంచి సంస్థకు రావలసిన చెల్లింపుల విలువ రూ. 38,000 కోట్లగా ఉందని మాక్రోటెక్‌ తెలిపింది. అంతేకాకుండా సంస్థకు రూ. 20,000 కోట్ల వాణిజ్య ఆస్తులున్నాయని వివరించింది.

అజయ్ పిరమల్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ అధిపతి: 
ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వలన తీవ్ర నిధుల కొరతతోపాటు, రీ ఫైనాన్సింగ్‌లో ఇబ్బందులను ఎదుర్కోవడంతో పిరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, పిరమల్ రియల్టీ లిమిటెడ్ కంపెనీల రేటింగ్‌లను గత నెలలో అనేక రేటింగ్‌ సంస్థలు తగ్గించాయి. ప్రస్తుతం ఈ కంపెనీ డెవలపర్‌ల రుణాలను తీర్చడంపై దృష్ఠి సారించింది. ఇప్పటికే  పిరమల్‌ క్యాపిటల్‌  డెవలపర్స్‌ రుణాలతో సంబంధం ఉన్న మొత్తం 232 ఒప్పందాలలో 18 ఒప్పందాలను పరిష్కరించామని కంపెనీ ఎక్సేంజ్‌  ఫైలింగ్‌లో పేర్కొంది. అంతేకాకుండా కంపెనీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు సంబంధించిన డెవలపర్ రుణాలను తగ్గించడంపై అధికంగా దృష్ఠి సారించింది. ఈ రుణాలు మొత్తం కంపెనీల రుణ పుస్తకంలో మార్చి 2015లో 79 శాతం ఉండగా ప్రస్తుతం 47 శాతానికి తగ్గింది. కాగా ఈ కంపెనీ మొత్తం రుణ విలువ రూ. 56,600 కోట్లు కావడం గమనార్హం.

పల్లోంజి మిస్త్రీ, పల్లోంజి మిస్త్రీ గ్రూప్ చైర్మన్:
అంచనాల కంటే తగ్గిన ఆస్తుల అమ్మకాలు, ప్రాపర్జీ వ్యాపారంలో అధ్వాన్న ప్రదర్శన వంటి కారణాల వలన గత 12 నెలలో షాపూర్జి పల్లోంజి అండ్‌ కో. కంపెనీ రేటింగ్‌ను కేర్‌ రేటింగ్స్‌, ఐసీఆర్‌ఏ సంస్థలు రెండు సార్లు తగ్గించాయి. కాగా ఈ గ్రూప్‌కు చెందిన సోలార్‌ కంపెనీ స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ లిమిటెడ్‌ను మార్కెట్‌లో నమోదుకావడంతో రూ. 2,900 కోట్లను సమీకరించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నగదును రుణ చెల్లింపులకు వినియోగించే అవకాశం ఉందని పరిశీలకులు తెలిపారు. 
  
  అపార్ట్ మెంట్ అమ్మకాలలో కొనసాగుతున్న  దీర్ఘకాలిక తిరోగమనం చిన్న, మధ్య తరహా డెవలపర్‌లను ప్రభావితం చేస్తున్నాయి. కానీ పెద్ద సంస్థల దన్నుగా ఉన్న డెవలపర్‌లు ఈ తిరోగమనాన్ని సమర్ధంగా ఎదర్కొంటున్నారని విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ఇ‍ండియా ప్రాపర్టీ మార్కెట్లో నగదు లభ్యత అధికంగా ఉన్నవాళ్లు లాభపడే అవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యాపారవేత్తలు తమ ఆస్తులను విక్రయించి రుణ చెల్లింపుల కోసం నిధులను సమీకరిస్తే దీర్ఘకాలంలో ఈ కంపెనీలు బలంగా మారతాయని ఉపాధ్యాయ అన్నారు. 

 



You may be interested

రియల్టీ ఒబేరాయ్‌ షేర్లకు ‘‘ఐటీ’’ షాక్‌..!

Thursday 22nd August 2019

రియల్టీ రంగలోని ఒబేరాయ్‌ రియల్టీ షేర్లు గురువారం ట్రేడింగ్లో 6శాతం పతనమయ్యాయి. ఆదాయం పన్ను శాఖ అధికారులు సోదాలు చేసినట్లు కంపెనీ తెలపడటం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.504.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆదాయ పన్ను శాఖ ఆగస్ట్‌ 20 నుంచి కంపెనీ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కార్యకలాపాలను నిలిపివేసినట్లు కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కంపెనీలో ఇంకా సోదాలు

2వారాల కనిష్టానికి బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Thursday 22nd August 2019

ప్రైవేట్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుండంతో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2వారాల కనిష్టానికి పతనమైంది. ఎన్‌ఎస్‌ఈలో కీలమైన ఈ ఇండెక్స్‌ నేడు 27,690.05 వద్ద ప్రారంభమైంది. యస్‌ బ్యాంక్‌ 7.50శాతం నష్టపోవడంతో పాటు, అధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ, కోటక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 1.5శాతం నుంచి 1శాతం క్షీణించడంతో నేటి ఉదయం ట్రేడింగ్‌లో 27385.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ నెల

Most from this category