News


అంతర్జాతీయ చార్ట్‌ల్లో భారత సూపర్‌ స్టాక్స్‌

Saturday 28th December 2019
Markets_main1577474760.png-30482

దేశీయ ఈక్విటీ మార్కెట్లు వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే రాబడుల విషయంలో వెనుకబడినా.. మన దేశానికి చెందిన కొన్ని స్టాక్ట్స్‌ 2019లో మెరుగైన రాబడులతో అంతర్జాతీయ చార్ట్‌ల్లో చోటు సంపాదించాయి. అంతర్జాతీయంగా టాప్‌-10లో ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ చోటు సంపాదించాయి. 

 

బీమారంగం
ఎస్‌బీఐ లైఫ్‌ షేరు 2019లో 65.8 శాతం రాబడులు ఇచ్చి ‘బ్లూంబర్గ్‌ వరల్డ్‌ ఇన్సూరెన్స్‌ ఇండెక్స్‌’లో టాప్‌ స్టాక్‌గా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 64.2 శాతం రాబడులతో ఆ తర్వాత స్థానంలో ఉంది. 

 

ఇంధన రంగం
ఇంధ్రప్రస్థ గ్యాస్‌ స్టాక్‌ ‘బ్లూంబర్గ్‌ వరల్డ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌’ చార్ట్‌లో ఉత్తమ పనితీరు చూపించిన స్టాక్‌గా నిలిచింది. బ్లూంబర్గ్‌ యుటిలిటీ ఇండెక్స్‌లో మూడో ఉత్తమ స్టాక్‌గానూ నిలిచింది. ఇంద్రప్రస్థ గ్యాస్‌ ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ సరఫరా వ్యాపారంలో ఉంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 2019లో 273 శాతం పెరిగి బ్లూంబర్గ్‌ వరల్డ్‌ ఎనర్జీ సూచీలో రెండో స్థానంలో నిలిచింది.

 

అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌
హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ స్టాక్‌ బ్లూంబర్గ్‌ డైవర్సిఫైడ్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌లో ఏడో ర్యాంకు దక్కించుకుంది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్‌ రెట్టింపవడం గమనార్హం. సిప్‌ ద్వారా స్థిరమైన పెట్టుబడుల రాకతోపాటు, లాభదాయకతలో కంపెనీ మంచి వృద్ధి చూపిస్తుండడం స్టాక్‌ ధరలపై ప్రతిఫలించింది. 

 

టెలికం
భారతీ ఎయిర్‌టెల్‌ స్టాక్‌ 2019లో 56 శాతం రాబడులతో గ్లోబల్‌ టెలికం అండ్‌ ఎక్విప్‌మెంట్‌ విభాగంలో నాలుగో అత్యుత్తమ రాబడులను ఇచ్చిన స్టాక్‌గా నిలిచింది. బ్లూంబర్గ్‌ వరల్డ్‌ కెమికల్స్‌ ఇండెక్స్‌లో పీఐ ఇండస్ట్రీస్‌, బ్యాంకింగ్‌ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు మెరుగైన రాబడులతో చోటు సంపాదించుకున్నాయి.



You may be interested

ఫ్లోర్‌ ప్రైస్‌ కోసం కొన్ని నెలలు ఆగాల్సిందే..

Saturday 28th December 2019

టెలికం సేవలకు ఫ్లోర్‌ ప్రైస్‌ (కనిష్ట ధరలు)ను నిర్ణయించాలని టెలికం కంపెనీలు ట్రాయ్‌పై ఒత్తిడి తీసుకురావడంతో, దీనిపై భాగస్వాముల అభిప్రాయాలను కోరుతూ ట్రాయ్‌ సంప్రదింపుల పత్రాన్ని ఇటీవలే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం తాము అందిస్తున్న సేవలకు, వసూలు చేస్తున్న చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని, లాభ, నష్టాల్లేని స్థాయికి తీసుకొచ్చేందుకు ఫ్లోర్‌ ప్రైస్‌ను నిర్ణయించాలన్నది కంపెనీల డిమాండ్‌. అయితే, కంపెనీల డిమాండ్‌ను మన్నిస్తూనే, ఇది వినియోగదారులకు వ్యతిరేకంగా ఉండరాదన్నది

సెన్సెక్స్‌ 411, నిఫ్టీ 119 పాయింట్లు అప్‌

Friday 27th December 2019

12250 చేరువలో ముగిసిన నిఫ్టీ మూడు రోజుల నష్టాలకు ముగింపు  రాణించిన బ్యాంకింగ్‌, అటో, అర్థిక రంగ షేర్లు  జనవరి డెరివేటివ్‌ సిరీస్‌కు శుభారంభాన్ని పలుకుతూ, మూడు రోజుల నష్టాలకు చెక్‌పెడుతూ మార్కెట్‌ శుక్రవారం భారీ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, అటో, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో  ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు 1శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 411 పాయింట్ల లాభంతో 41,575.14 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119.25 పాయింట్లు పెరిగి

Most from this category