STOCKS

News


మార్కెట్లకు కొత్త శిఖరాలు ఇప్పట్లో లేనట్టే..!??

Thursday 29th August 2019
Markets_main1567102137.png-28098

నిపుణుల అంచనాలు

‘దేశీయ స్టాక్స్‌ వచ్చే ఏడాది పెరగొచ్చు.. కానీ ఇటీవలి నష్టాలను పూడ్చుకునే స్థాయిలో కాదు’... రాయిటర్స్‌ సంస్థ నిర్వహించిన పోల్‌లో ఎక్కువ మంది నిపుణులు చెప్పిన అభిప్రాయం ఇది.  ప్రస్తుత ఆర్థిక మందగమనం, బలహీన కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ విషయంలో వీరు ఆందోళన వ్యక్తం చేశారు. బీఎస్‌ఈ ఈ ఏడాది ఇప్పటి వరకు 4 శాతం పెరగ్గా... జూన్‌లో జీవితకాల గరిష్ట స్థాయి నుంచి చూస్తే 10 శాతం పడిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక చర్యల కారణంగా కాస్తంత ర్యాలీ చేసినట్టు కనిపించినప్పటికీ, మార్కెట్లు మళ్లీ నష్టాల బాటే పట్టాయి. అయితే, ప్రభుత్వ చర్యల ప్రభావం దీర్ఘకాలంలో పరిమితమేనని, సూచీలు ఈ ఏడాది జూన్‌లో నమోదు చేసిన గరిష్టాలను తిరిగి 2021 వరకు అధిగమించే అవకాశాల్లేవని నిపుణులు రాయిటర్స్‌ పోల్‌లో పేర్కొన్నారు. ఈ పోల్‌లో 50కు పైగా విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

 

‘‘ఆర్థిక మంత్రి ప్రకటించిన సంస్కరణలు కుదుపువంటి స్పందన మాత్రమే. కార్పొరేట్‌ కంపెనీల బలహీన ఆదాయాలు, ఆర్థిక మందగమనం వల్ల దీర్ఘకాలం పాటు స్టాక్స్‌ ఒత్తిడినే ఎదుర్కొంటాయి. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం సమీప కాలంలో సమసిపోయే అవకాశం కనిపించకపోవడంతో అంతర్జాతీయ ఆర్థిక మందగమనం రిస్క్‌లు పెరుగుతున్నాయి. ఈక్విటీలకు ఇది కూడా ఒక అతిపెద్ద రిస్క్‌’’ అని టారస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ ఆర్‌కే గుప్తా పేర్కొన్నారు. జూలై 5 కేంద్ర బడ్జెట్‌ తర్వాతి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు మన ఈక్విటీల్లో నికర అమ్మకం దారులుగానే కొనసాగుతున్నారు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి సంబంధించి చాలా కంపెనీలు చాలా నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించాయి. డిమాండ్‌ పడిపోవడం, వ్యవస్థలో లిక్విడిటీ కొరత వంటి సమస్యలు ఈ పరిస్థితికి కారణాలుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో జీడీపీ 5.8 శాతానికి క్షీణించడంతో వృద్ధికి ఊతమిచ్చేందుకు ఆర్‌బీఐ కూడా ఇప్పటి వరకు వరుసగా 110 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల కోత విధించింది. 

 

రాయిటర్స్‌ పోల్‌లో పాల్గొన్న వారిలో సగానికి పైగా అనలిస్టులు.. వచ్చే ఆరు నెలల కాలలో భారత స్టాక్‌ మార్కెట్లు 1-10 శాతం మధ్య పెరగొచ్చని తెలుపగా, ఇద్దరు మాత్రం 10 శాతానికి పైగా పెరుగుతాయని పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ ప్రకటనలు దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. ఇవి ఈక్విటీ మార్కెట్ల పతనాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. వీటికితోడు చమురు ధరల క్షీణత రానున్న రోజుల్లో సూచీలు భారీ బౌన్స్‌బ్యాక్‌కు దారితీస్తాయి’’ అని ఎడెల్‌వీజ్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినయ్‌ ఖట్టర్‌ పేర్కొన్నారు. అయితే, వీరిలో ఒక వంతు మంది అనలిస్టులు మాత్రం రానున్న ఆరు నెలల్లో స్టాక్స్‌ పడిపోవచ్చని అంచనా వేశారు. ‘‘ప్రపంచ ఆర్థిక వృద్ధి మరింత క్షీణత, వాణిజ్య వివాదాలు విస్తరిస్తుండడం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనాల కోసం చూస్తున్నారు. దీంతో రానున్న నెలల్లో భారత స్టాక్‌ మార్కెట్లు క్షీణించే అవకాశం ఉంది’’ అని వర్చుసో ఎకనమిక్స్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ షేర్‌ మెహతా అన్నారు. You may be interested

71.78 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Friday 30th August 2019

దేశియ రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం 71.78 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. యుఎస్‌ విధించిన సుంకాలకు ప్రతీకారంగా ఇప్పట్లో యుఎస్‌ దిగుమతులపై టారిఫ్‌లను విధించమని గురువారం చైనా అనడంతో ఇరు దేశాల మధ్య ముదురుతున్న వాణిజ్య ఘర్షణ కొంత సరళతరం అయ్యింది. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌మారకంలో 3 పైసలు బలహీనపడి 71.80 ముగిసింది. గత పది రోజుల నుంచి డాలర్‌మారకంలో నష్టపోతున్న చైనా కరెన్సీ యువాన్‌ గురువారం

10,981కు దిగువనే ఉంటే మరింత క్షీణత..

Thursday 29th August 2019

నిఫ్టీ కీలకమైన 200 డీఎంఏ 11,207కు దిగువనే కొనసాగుతండడం, ఆ లోపు నిరోధ స్థాయిలను కూడా అధిగమించలేకపోవడంతో తదుపరి సెషన్లలో కదలికలను గమనించాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ 11,000 మార్క్‌పైన కొసాగలేకపోయిందని, 11,150 స్థాయి, 200 డీఎంఏను దాటనంత వరకు స్థిరమైన అప్‌సైడ్‌కు అవకాశం లేదని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు.    ‘‘నిఫ్టీ ఎగువవైపు 11,150, దిగువవైపు 10,780 మధ్య

Most from this category