News


2 ట్రిలియన్‌ డాలర్‌ క్లబ్‌ నుంచి భారత్‌ మార్కెట్‌ బయటకు!

Monday 5th August 2019
Markets_main1564987258.png-27538

దేశియ స్టాక్‌ మార్కెట్‌ (బీఎస్‌ఈ) రేండేళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నా 2 ట్రిలియన్‌ మార్కె‍ట్‌ క్యాప్‌(ఎం-క్యాప్‌) క్లబ్‌ నుంచి నిష్క్రమించింది.   ఆగస్టు 2 నాటికి అన్ని లిస్టెడ్ ఇండియన్ స్టాక్స్ విలువ 1.97 ట్రిలియన్ డాలర్లకు పడిపోవడం గమనర్హం. ఫలితంగా అతి పెద్ద మార్కెట్‌ క్యాప్‌ క్లబ్‌లో భారత ర్యాంక్‌ జర్మనీకి దిగువన 9 వ స్థానానికి దిగజారింది.   
  బడ్జెట్‌ తర్వాత ఎఫ్‌ఐఐలు దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు. అత్యంత విలువైన 10 భారతీయ కంపెనీలలో ఎనిమిది కంపెనీలు  మార్కెట్ వాల్యుయేషన్‌ పరంగా గత వారం(అగష్టు 2తో ముగిసిన) రూ.89,535 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. మే 28, 2017 లో ఇండియా 2 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) మార్కును దాటి, జర్మనీ స్థానంలో ఏడవ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది.
   ప్రస్తుతం ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ భారీగా పడిపోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), ఆయిల్ అండ్‌ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్‌జిసి), యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, లార్సెన్ అండ్‌ టౌబ్రో షేర్ల పతనం అధికంగా పనిచేసింది. గత రెండు సెషన్లలో కలిపి రూ .2,881 కోట్ల పెట్టుబడుల్ని ఎఫ్‌పిఐలు వెనక్కు తీసుకున్నారు. 2 ట్రిలియన్ క్లబ్‌లో యుఎస్, చైనా, జపాన్, హాంకాంగ్, యుకె, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ దేశాల మార్కెట్లున్నాయి. ఎం-క్యాప్‌లోని 15 అతిపెద్ద దేశాలలో భారతదేశం, దక్షిణ కొరియా మాత్రమే ఈ ఏడాదిలో ఇప్పటివరకు మార్కెట్ విలువను కోల్పోయాయి.

 



You may be interested

నాణ్యమైన షేర్లను విడిచిపెట్టకండి

Monday 5th August 2019

‘ప్రస్తుత మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలలో కూడా మా సలహా ఎంటంటే ‘నాణ్యమైన స్టాకు’లను విడిచి పెట్టకండి. ప్రస్థుత పరిస్థితులలో ఇన్వెస్టర్లు నాణ్యమైన స్టాకులను ఓపికగా కూడబెట్టుకోవాలి. వీటిపై  రివార్డులు ఈ ఏడాది  రెండవ భాగంలో కనిపిస్తాయి’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నవీన్ కులకర్ణి ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.  కార్పోరేట్‌ కంపెనీల ఆదాయాలు మిశ్రమంగా ఉన్నాయని, ఫలితాలు వెలువడిన తర్వాత  ఈ

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 10 శాతం క్రాష్‌

Monday 5th August 2019

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్ఎల్‌) షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో కొన్ని ఏళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. కంపెనీకి ఆడిట్‌ సేవలు అందించే డెల్లాయిట్‌ కంపెనీ బాధ్యతలనుంచి తప్పకున్నట్లు వార్తలు వెలుగులో రావడం ఇందుకు కారణమైంది. ఈ అంశంపై వివరణ కోరగా ఇరుసంస్థలు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో నేడు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 12.50శాతం నష్టపోయి రూ.40.85

Most from this category