STOCKS

News


2020లో మార్కెట్‌ ర్యాలీ పరిమితం!

Wednesday 27th November 2019
Markets_main1574832863.png-29894

రాయిటర్స్‌ పోల్‌లో అంచనాలు
దేశీయ మార్కెట్లు వచ్చే ఏడాది కూడా అప్‌మూవ్‌ చూస్తాయని, కాకపోతే పరుగులు చాలా పరిమితంగా ఉంటాయని రాయిటర్స్‌పోల్‌లో పాల్గొన్న ఈక్విటీ నిపుణులు అత్యధికులు అంచనా వేశారు. విత్త ఉద్దీపనలు, ఆర్‌బీఐ సరళీకృత మానిటరీ పాలసీలు దేశ ఆర్థిక మందగమనాన్ని నిరోధించలేకపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల ఈ ప్రభావంతో ఈక్విటీ జోరు కొంత మేరే ఉంటుందని తెలిపారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం తీసుకునే చర్యలు క్రమానుగత రికవరీకి దోహదం చేస్తాయని, పూర్తి రికవరీ కనిపించడానికి కనీసం 12 నెలలు పడుతుందని అనలిస్టులు పేర్కొన్నారు. అందువల్ల ఎకనమిక్‌ రికవరీ, ఎర్నింగ్స్‌ గ్రోత్‌ వచ్చే రెండేళ్లు మందకొడిగానే ఉంటాయన్నారు. అందువల్ల ఏడాది కాలానికి ఈక్విటీ మార్కెట్‌ రాబడులు కూడా పరిమితంగానే ఉంటాయన్నారు.

రాబోయే ఏడాదిలో డిమాండ్‌లో రికవరీ రావడమే మార్కెట్‌ను నడిపిస్తుందని 48 మంది అనలిస్టుల్లో 17మంది పేర్కొనగా, 15 మంది ఎఫ్‌ఐఐలే డిసైడ్‌ చేస్తాయని, ఐదోవంతు మంది మాత్రం విత్త ఉద్దీపనలే ఎకానమీని నడిపిస్తాయని తెలిపారు. ప్రస్తుతం దేశీయ ఎకానమీతో సహా అన్నీ బాటమ్‌అవుట్‌ స్థితిలో ఉన్నాయని, ఇక్కడనుంచి మెరుగుదలనాశించవచ్చని నిపుణులు తెలిపారు. రాబోయే వారం ఆర్‌బీఐ మరోమారు రేట్లను తగ్గిస్తుందని రాయిటర్స్‌ పోల్‌ అంచనా వేసింది. ఇదే నిజమైతే వరుసగా ఆరోదఫా ఆర్‌బీఐ రేట్‌ కట్‌ నిర్ణయం తీసుకున్నట్లు కానుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌ పీఈ బాగా ఎక్కువగా ఉందని, ఇటీవలి ర్యాలీతో వాల్యూషన్లపై ఆందోళనలు మరోమారు పెరిగాయని పోల్‌లో అనలిస్టులు హెచ్చరించారు. You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ టార్గెట్‌ ధరను పెంచిన మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 27th November 2019

అం‍తర్జాతీయ బ్రోకరేజి సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌, ఫైనాన్స్‌ కార్పోరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) షేరుపై ఓవర్‌వెయిట్‌ను కొనసాగించడంతో పాటు, షేరు టార్గెట్‌ ధరను రూ. 2,600 స్థాయి నుంచి రూ. 2,900 స్థాయికి పెంచింది. ఫలితంగా ఈ కంపెనీ షేరు విలువ బుధవారం సెషన్లో 1 శాతానికి పైగా లాభపడి ట్రేడవుతోంది. ‘ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు) సెక్టార్‌లో వ్యవస్తీకృతంగా బలంగా ఉండడంతో, కంపెనీ ఆర్‌ఓఈ(రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ), ఈపీఎస్‌(షేరుపై లాభం)

అటోరంగ షేర్ల పరుగు

Wednesday 27th November 2019

మార్కెట్‌ ప్రారంభంలో అటోరంగ షేర్లు పరుగులు పెడుతున్నాయి. నేడు జరగనున్న కేంద్ర కేబినేట్‌ సమావేశంలో.... కాలం చెల్లిన వాహనాలను వినియోగం నుంచి తొలిగించేందుకు ప్రభుత్వం రూపొందించిన వెహికిల్ స్క్రాప్ పాలసీకి ఆమోదం లభించవచ్చనే అంచనాలు అటో రంగ షేర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2శాతం పెరిగింది. భారత్‌ ఫోర్జ్‌ 3శాతం, టాటామోటర్స్‌, ఎంఅండ్‌ఎం, అశోక్‌లేలాండ్‌ షేర్లు 2.50శాతం లాభపడ్డాయి. మారుతి, ఐషర్‌ మోటర్స్‌,

Most from this category