News


తగ్గిన రూపీ, బాండ్‌ ధరలు

Wednesday 31st July 2019
Markets_main1564549672.png-27432

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశియంగా ద్యవ్యోల్బణం పెరుగుతుందని మార్కెట్‌ ఆందోళన చెందడంతో రూపీ, బాండ్‌ ధరలు బుధవారం పడిపోయాయి. దీంతోపాటు కీలక ఫెడ్‌ సమావేశం ముందు ట్రంప్‌ చైనాను ఒత్తిడికి గురిచేస్తుండడంతో  ట్రేడ్‌ వార్‌ తిరిగి ప్రారంభమవుతుందనే ఆందోళనలలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. రూపీ డాలర్‌ మారకంలో బుధవారం 4 పైసలు బలహీనపడి 68.90 వద్ద ప్రారంభమైంది. గత సెషన్లో రూపీ  68.86 వద్ద ముగిసింది.
  పదేళ్ల ప్రభుత్వ బాండ్‌పై రాబడి గత సెషన్‌లో 6.39 శాతం ఉండగా బుధవారం ట్రేడింగ్‌లో 6.404 శాతానికి పెరిగింది. బాండ్ ధరలు, ఈల్డ్‌ వ్యతిరేక దిశల్లో కదులుతాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో ఎనిమిదింటిలో పెరిగడం గమనర్హం. దీంతోపాటు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఒక దశాబ్దం తర్వాత మొదటిసారిగా వడ్డీ రేట్లను తగ్గిస్తుందని పరిశీలకులు విస్తృతంగా భావిస్తున్నారు. ఇది రూపీపై ప్రభావం చూపనుంది.



You may be interested

ఫెడ్‌ నిర్ణయం కొరకు పసిడి ఎదురుచూపులు

Wednesday 31st July 2019

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు నిర్ణయం కొరకు పసిడి ఎదురుచూపులు చూస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ 2నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫలితంగా నేడు ఆసియా ట్రేడింగ్‌లో పసిడి స్థిరంగా కదులుతోంది. బుధవారం ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప లాభంతో 1,430.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ సమావేశం కారణంగా పసిడి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఇంతకాలం వేచిచూసారు. ఒకవేళ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 31st July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితయమ్యే షేర్ల వివరాలు  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- రుణదాతల కమిటికి తుది రిజల్యూషన్‌ ప్రణాళికను నివేదించింది. కమిటి ఈ నివేదికపై ఆగస్ట్‌ మొదటివారంలో చర్చించనుంది.  జీ ఎంటర్‌టైన్‌మెంట్‌:- రెండు రోజులపాటు జరిగిన చర్చల అనంతరం బైండింగ్‌ ఒప్పందంలో భాగంలో ప్రమోటర్లు సంస్థలో కొంతశాతం వాటా అమ్మడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ:- క్రిడెట్‌ కార్డు జాయింట్‌ వెంచర్‌లో కొంతభాగాన్ని విక్రయించి రూ.5,000-6,000 కోట్లను సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- తన టెలికాం

Most from this category