News


రైల్వే స్టేషన్ల అభివృద్ధికి దిగ్గజాల క్యూ

Friday 7th February 2020
Markets_main1581099623.png-31608

ప్రయివేటు రైళ్లను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పట్టాలపైకి ఎక్కించిన రైల్వే శాఖ.. ఇక రైల్వే స్టేషన్ల అభివృద్ధిలోనూ ప్రయివేటు సంస్థల సాయం తీసుకోనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 50 రైల్వే స్టేష్లను దేశవ్యాప్తంగా ప్రయివేటు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి కోసం ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అదానీ గ్రూపు, షాపూర్‌జీ పల్లోంజీ, టాటా రియాలిటీ, ఎన్‌ఐఐఎఫ్‌, జీఎంఆర్‌, జేకేబీ ఇన్‌ఫ్రా, గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌, ఎస్సెల్‌ గ్రూపు, యాంకరేజ్‌ క్యాపిటల్‌ తదితర సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి.

 

50 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కాంట్రాక్టులను సొంతం చేసుకున్న సంస్థలు వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో ష్టేషన్‌ అభివృద్ధికి గాను గరిష్టంగా రూ.250 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్ల నుంచి ప్రమాణించే వారిపై ఆ తర్వాత చార్జీల భారం పడనుంది. ప్రస్తుతం ప్రైవేటు విమానాశ్రయాల్లో యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు వసూలు చేస్తున్న మాదిరే, రైల్వే ప్రయాణికులు టికెట్లపై ఆ మేరకు అదనపు చార్జీలను భరించాల్సి వస్తుంది. ఇండియన్‌ రైల్వేస్‌ స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ) రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రాజెక్టులకు బిడ్లను స్వీకరించడం, అవార్డులను కేటాయించడం చేయనుంది. ఐఆర్‌ఎస్‌డీసీ ఇప్పటికే నాగ్‌పూర్‌, గ్వాలియర్‌, అమృత్‌సర్‌, సబర్మతి స్టేషన్లకు సంబంధించి రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌కు ఆహ్వానం పలికింది. అంటే ఆసక్తిగల సంస్థలు దరఖాస్తు చేసుకుంటే, అర్హత గల సంస్థలను ఎంపిక చేయనుంది. ఆ తర్వాత బిడ్లను ఆహ్వానించడం జరుగుతుంది. 50 స్టేషన్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో బిడ్డింగ్‌కు తీసుకొస్తామని ఓ అధికారి తెలిపారు. ఈ స్టేషన్ల అభివృద్ధి వ్యయ అంచనా రూ.50,000కోట్లు. బిడ్డింగ్‌కు ముందస్తు సమావేశం జనవరిలో నిర్వహించగా, టెక్నికల్‌ సామర్థ్యం కాకుండా, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా అర్హతను తేల్చాలని డెవలపర్లు కోరినట్టు ఆ అధికారి చెప్పారు. 



You may be interested

టాటా స్టీల్‌ నష్టాలు రూ.1,228 కోట్లు

Saturday 8th February 2020

రూ.34,774 కోట్లకు అమ్మకాలు  7 శాతం తగ్గిన నిర్వహణ లాభ మార్జిన్‌  న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో క్వార్టర్‌లో రూ.1,228 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,753 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా స్టీల్ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే (ఈ క్యూ2లో)రూ.3,302 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. అమ్మకాలు తక్కువగా ఉండటం, యూరప్‌ కార్యకలాపాలకు సంబంధించిన ఇంపెయిర్‌మెంట్‌

ఐడీబీఐలో వాటాను ముందుగానే తగ్గించుకుంటాం: ఎల్‌ఐసీ

Friday 7th February 2020

ఐడీబీఐలో 51 శాతం వాటా కలిగిన ఎల్‌ఐసీ నిర్దేశిత 12 ఏళ్ల వరకు ఆగకుండా ముందుగానే తమ వాటాను తగ్గించుకుంటామని స్పష్టం చేసింది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ తన వాటాను తగ్గించుకునే విషయమై ఐఆర్‌డీఏఐ ఎటువంటి గడువు విధించలేదని ఎల్‌ఐసీ చైర్మన్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ 12 ఏళ్ల గడువు ఇచ్చినట్టు చెప్పారు. అయితే, ఎల్‌ఐసీ కూడా లిస్టింగ్‌కు వెళ్లాలనుకుంటున్నందున అంత సుదీర్ఘకాలం పాటు వేచి చూడాలనుకోవడం లేదన్నారు.

Most from this category