News


‘‘ప్యాకేజీ’’ లాభాల ప్రారంభం ..!

Thursday 26th March 2020
Markets_main1585196288.png-32684

దేశీయ మార్కెట్‌ గురువారం లాభంతో ప్రారంభమైంది. కరోనా వైరస్‌ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.5ట్రిలియన్ల ప్యాకేజీని సిద్ధం చేస్తుందనే అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే ఆర్థిక అగ్రరాజ్యమైన అమెరికా సెనెట్‌ సైతం కరోనా వైరస్‌ ఉద్దీపన చర్యల్లో భాగంగా  2ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలపడటంతో పాటు వైట్‌హౌస్‌కు పంపడం కూడా మార్కెట్లకు ఉత్సాహానిచ్చింది. దీంతో బెంచ్‌మార్క్‌ సూచీలు నిన్నటి భారీ లాభాల ముగింపును కొనసాగిస్తూ సెన్సెక్స్‌ 243.93 పాయింట్ల లాభంతో 28779.71 వద్ద, నిఫ్టీ 53.85 పాయింట్లు పెరిగి 8371.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 

అయితే కరోనా వైరస్‌ వ్యాధి భయాలు, నేడు మార్చి ఎఫ్‌అండ్‌ఓ కాంటాక్టు ముగింపు తేది కావడంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత, డాలర్‌ మారకంలో రూపాయి విలువ మునుపటి ముగింపు(75.88)తో పోలిస్తే ఒక పైసా లాభం(75.87)తో ఫ్లాట్‌గా ప్రారంభం కావడం తదితర అంశాలు మార్కెట్‌కు కొంత ప్రతికూలంగా ఉన్నాయి.


ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 594 పాయింట్ల లాభంతో 29130.47 వద్ద, నిఫ్టీ 147.05 పాయింట్లు పెరిగి 8464.90 వద్ద  ట్రేడ్‌ అవుతున్నాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఐటీ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, అటోరంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. 

ఇన్ఫోసిస్‌, ఇన్ప్రాటెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 6శాతం నుంచి 15శాతం పెరిగాయి. జీ లిమిటెడ్‌, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, మారుతీ, ఐఓసీ షేర్లు అరశాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 26th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇండియా సిమెంట్‌: ఎవెన్యూ సూపర్‌ మార్ట్‌ అధినేత రాధాకృష్ణ దమానీ ఇండియా సిమెంట్‌లోని ఒక్కో షేరును రూ.94.97 చొప్పున 16 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఇండియా సిమెంట్‌లోని 4 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సోమవారమే ప్రకటించారు. రియలన్స్‌ ఇండస్ట్రీస్‌: ప్రమోటర్‌ దేవర్షీ కమర్షియల్‌ ఎల్‌ఎల్‌పీ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా రూ.11,000 కోట్ల షేర్లనుఅమ్మగా దానిని సమర్జిత్‌

కోవిడ్‌ సంక్షోభం నుంచి గట్టెక్కుతాం..!

Thursday 26th March 2020

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ధీమా న్యూయార్క్:   కోవిడ్-19 సంక్షోభంతో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వాటన్నింటినీ అధిగమించి బైటపడగలదని సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ధీమా వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ ఆర్థికంగా బలమైన స్థితిలోనే ఉందని, మరింత పటిష్టంగా మారగలదని ఆయన చెప్పారు. తాము గతంలో ప్రకటించిన ఉత్పత్తులను ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా

Most from this category