STOCKS

News


ఇండియన్‌ బ్యాంక్‌ 11% క్రాష్‌!

Thursday 24th October 2019
Markets_main1571909480.png-29114

 క్యూ2 ఫలితాలను ప్రకటించక ముందు భారీగా పెరిగిన ఇండియన్‌ బ్యాంక్‌ షేరు, గురువారం లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో సెషన్లో నష్టాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నం 2.51 సమయానికి ఈ బ్యాంక్‌ షేరు విలువ 11.83 శాతం నష్టపోయి రూ. 126.00 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 142.90 వద్ద పాజిటివ్‌గా ముగిసిన ఈ షేరు, గురువారం ట్రేడింగ్‌లో రూ. 141.95 వద్ద ప్రారంభమై, రూ. 125.25 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. క్యూ2 ఫలితాలలో ఈ బ్యాంక్‌ నికర లాభం రెండింతలైనప్పటికి స్థూల ఎన్‌పీఏ(మొండి బకాయిలు) స్వల్పంగా పెరిగాయి.  
ఇండియన్‌ బ్యాంక్‌ క్యూ2 ఫలితాలు:
 నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.359 కోట్లకు పెరిగిందని ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంక్‌ నికర లాభం రూ.150 కోట్లుగా ఉంది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.5,219 కోట్ల నుంచి రూ.6,045 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ రుణ నాణ్యత నిలకడగా ఉంది. గత క్యూ2లో 7.19 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.20 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు మాత్రం 4.23 శాతం నుంచి 3.54 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.752 కోట్ల నుంచి రూ.721 కోట్లకు తగ్గాయి. You may be interested

నిఫ్టీ మునుముందుకే!

Thursday 24th October 2019

రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా అంచనా ప్రస్తుత మార్కెట్‌ గమనం చూస్తే నిఫ్టీ వెనక్కు రావడం కన్నా, ముందుకు కొనసాగేందుకే ఇష్టపడుతుందని ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ ముందు 12వేల పాయింట్లను చేరవచ్చన్నారు. మార్కెట్లో పరిస్థితులు అంతా అనుకునేంత అధ్వాన్నంగా ఏమీలేవన్నారు. ప్రస్తుత బలహీనదశ క్రమంగా ముగిసిపోతుందన్నారు. నిఫ్టీ కార్పొరేట్‌ టాక్స్‌ కట్‌ అనంతరం రెండ్రోజుల్లో దాదాపు వెయ్యిపాయింట్ల ర్యాలీ చేసిందని, సూచీలు ఈ ర్యాలీని జీర్ణించుకోవాలని, అందుకే కన్సాలిడేషన్‌ జరుగుతోందని

దేశీయ బ్రోకరేజ్‌ల టాప్‌ ‘బై’ సిఫార్సులు!

Thursday 24th October 2019

గత సెషన్లో ఐటీ, ఆటో స్టాకులలో కొనుగోళ్లు అధికంగా జరగడంతో దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు, నిఫ్టీ  11,600 స్థాయికి పైన, సెన్సెక్స్‌ 39,000 స్థాయికి పైన ముగిశాయి. దీర్ఘ, మధ్యస్థ కాలానికి గాను వివిధ బ్రోకరేజిలు బై సిఫార్సు చేసిన 11 స్టాకులు.. బ్రోకరేజి: మోతీలాల్ ఓస్వాల్  ఏసీసీ : రేటింగ్: కొనచ్చు | ప్రస్తుత ధర: రూ .1,525 | టార్గెట్‌ ధర: రూ .1,900 | అప్‌సైడ్‌: 24 శాతం  కోరమాండల్

Most from this category