News


ఇండియన్‌ ఏడీఆర్‌లు ‘బేర్‌’

Tuesday 10th March 2020
Markets_main1583814943.png-32384

సోమవారం కుప్పకూలిన దేశీ స్టాక్స్‌ ఏడీఆర్‌లు
దేశీయంగా శుక్రవారం ముగింపుకంటే దిగువకు
నేడు ప్రపంచ మార్కెట్లు కోలుకునే చాన్స్‌
7 శాతం రికవర్‌ అయిన ముడిచమురు ధరలు

ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు, ముడిచమురు, బాండ్ల ఈల్డ్స్‌కు సంబంధించినంతవరకూ సోమవారం బ్లాక్‌ మండేగా మిగిలింది. యూరోపియన్‌, అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లు ఏకంగా 8 శాతం చొప్పున పతనంకాగా.. పన్నెండేళ్ల తదుపరి అమెరికా స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ ప్రారంభమైన పావు గంటలోనే అమ్మకాలు ఉధృతమై లావాదేవీలు నిలిచిపోయాయి. బ్లూచిప్స్‌ పతనంకావడంతో ఎస్‌అండ్‌పీ ఏకంగా 7 శాతం నష్టపోయింది. దీంతో తొలి గంటలో ట్రేడింగ్‌ నిలిచిపోయింది. చివరికి డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 8 శాతం నష్టాలతో ముగిశాయి. దీంతో అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశ కంపెనీల అమెరికన్‌ డిపాజిటరీ రిసీప్ట్స్‌(ఏడీఆర్‌లు)లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి దేశీయంగా ఎన్‌ఎస్‌ఈలో సోమవారం ముగింపు ధరలకంటే అధికంగా నష్టపోయాయి. అయితే హోలీ పండుగ సందర్భంగా నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవుకాగా.. బుధవారం తిరిగి మార్కెట్లు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ ఇండెక్సుల ఫ్యూచర్స్‌ 2 శాతం లాభాలను చూపుతున్నాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సైతం​2-0.2 శాతం మధ్య బలపడ్డాయి. ఇక గత రెండు రోజుల్లో 34 శాతం పతనమైన ముడిచమురు ధరలు సైతం 7 శాతం రికవర్‌ అయ్యి ట్రేడవుతున్నాయి. దీంతో బుధవారం పరిస్థితులు అనుకూలిస్తే దేశీ మార్కెట్లు సైతం​రికవర్‌ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం..

వేదాంతా, టాటా మోటార్స్‌ వీక్‌
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌) వారాంతాన అధిక శాతం క్షీణ పథంలో సాగాయి. టాటా మోటార్స్‌(టీటీఎం) 13.65 శాతం పతనమై 6.71 డాలర్ల వద్ద నిలవగా.. వేదాంతా(వీఈడీఎల్‌) 17.3 శాతం పడిపోయి 4.9 డాలర్లను తాకింది. ఈ బాటలో ఇన్ఫోసిస్‌ 7.3 శాతం క్షీణించి 9.08 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 7.3 శాతం నష్టంతో 11.97 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇతర కౌంటర్లలో విప్రో లిమిటెడ్‌(విట్‌) 7.3 శాతం బలహీనపడి 3.25 డాలర్ల వద్ద ముగియగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 4.3 శాతం నీరసించి 49.19 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక డాక్టర్‌ రెడ్డీస్‌(ఆర్‌డీవై) 5.7 శాతం తక్కువగా 40.10 డాలర్ల వద్ద నిలిచింది.  

సోమవారం ఇలా
ఎన్‌ఎస్‌ఈలో సోమవారం టాటా మోటార్స్‌ షేరు 8.2 శాతం పతనమై రూ. 105 వద్ద నిలవగా.. వేదాంతా మరింత అధికంగా 15.3 శాతం కుప్పకూలి రూ. 94 వద్ద ముగిసింది. ఇక విప్రో 4 శాతం నష్టంతో రూ. 215 వద్ద స్థిరపడగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2 శాతం తక్కువగా రూ. 1112 వద్ద నిలిచింది. ఇతర కౌంటర్లలో ఇన్ఫోసిస్‌ 4.4 శాతం క్షీణించి రూ. 706 వద్ద, డాక్టర్‌ రెడ్డీస్‌ 3.4 శాతం నష్టంతో రూ. 3063 వద్ద ముగిశాయి. ఇదే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ 6 శాతం పతనమై రూ. 458 దిగువన స్థిరపడింది.



You may be interested

రూ.44,000పైన పసిడి

Tuesday 10th March 2020

సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ఎనిమిదేళ్ల తర్వాతా మొదటిసారి 1700 డాలర్లు చేరుకున్న పసిడి మంగళవారం స్వల్పంగా తగ్గింది. నిన్న స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమవ్వడం, ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక పెట్టుబడులవైపు దృష్టిపెడుతుండడంతో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.300 తగ్గి 10 గ్రాముల బంగారం రూ.44,353.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 9 డాలర్లు తగ్గి నేటి ఉదయం ఔన్స్‌ బంగారం 1,666.80

నేడు మార్కెట్‌కు హోలీ సెలవు

Tuesday 10th March 2020

హోలీ సందర్భంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల్లో ట్రేడింగ్‌ జరగదు. అయితే కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లు మాత్రం సాయంత్రం పనిచేస్తాయి. మార్కెట్‌ తిరిగి బుధవారం ప్రారంభం అవుతోంది.  కరోనా ప్రభావం పెరుగుతుండటం, ముడి చమురు ధరలు కారణంగా క్రితం రోజు సెన్సెక్స్‌ 1,942 పాయింట్లు నష్టపోయి 35,635 వద్ద, నిఫ్టీ 553 పాయింట్లను కోల్పోయి 10,436 వద్ద స్థిరపడింది.  రాత్రి అమెరికా మార్కెట్లు సైతం భారీ పతనాన్ని చవిచూశాయి. డోజోన్స్‌

Most from this category