News


లాభపడ్డ ఏడీఆర్‌లు

Saturday 21st December 2019
Markets_main1576918488.png-30354

అమెరికాలో ట్రేడయ్యే భారత్‌ ఏడీఆర్‌లు శుక్రవారం దాదాపు 2శాతం వరకు పెరిగాయి. టాటా మోటర్స్‌, వేదాంత ఏడీఆర్‌లు తప్ప మిగిలిన అన్ని ఏడీఆర్‌లు 2శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. విప్రో ఏడీఆర్‌ అత్యధికంగా 2శాతం పెరిగింది. ఐసీఐసీఐ ఏడీఆర్‌ 1.50శాతం లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ 1శాతం నష్టపోగా, వేదాంత ఏడీఆర్‌లు అరశాతం పతనయ్యాయి. 
రికార్డు స్థాయిలో ముగిసిన అమెరికా మార్కెట్లు:- 
అమెరికా మార్కెట్లు శుక్రవారం రికార్డు స్థాయిలో ముగిశాయి. నవంబర్‌ వినియోగ వ్యయ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడంతో పాటు  అమెరికా చైనాల మధ్య రెండో దఫా చర్చలు పురోగతి సాధించవచ్చనే అంచనాలు మార్కెట్ల రికార్డు ర్యాలీకి కారణమయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా, హాంకాంగ్‌కు సంబంధిత సమస్యలపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో  సానుకూల చర్చలు జరపడటంతో మార్కెట్‌ వర్గాలకు వాణిజ్య చర్చలపై ఆశావహన అంచనాలు పెరిగాయి. ఎస్‌ అండ్‌ పీ ఇండెక్స్‌ వరసగా ఏడో ట్రేడింగ్‌ సెషన్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోంది. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ సైతం వరుసగా 8రోజూ లాభాల్లో ముగిసింది. డో జోన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏవరేజ్‌ ఇండెక్స్‌ 0.28శాతం పెరిగి 28,455.09 వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ అరశాతం పెరిగి 3,221.22 వద్ద, నాస్‌ డాక్‌ ఇండెక్స్‌ సైతం 0.45శాతం లాభంతో 8,924.96 వద్ద స్థిరపడింది.



You may be interested

స్వల్పకాలానికి అప్రమత్తత!

Saturday 21st December 2019

నిఫ్టీపై జిమిత్‌ మోదీ అంచనా ఈ వారం నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలు నూతన గరిష్ఠాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లన్నీ బలంగా ఉండడం కలిసివచ్చింది. వాల్యూషన్లు అధికంగా ఉండడం, నెగిటవ్‌ వడ్డీరేట్లు, ట్రంప్‌ అభిశంసన, భౌగోళిక రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉండడం... లాంటి నెగిటివ్‌ వార్తలున్నా మార్కెట్లు పాజిటివ్‌గానే స్పందించాయి. దేశీయంగా డీఐఐలు మార్కెట్లో కొనుగోళ్లకు విముఖత చూపుతున్నా, ఎఫ్‌ఐఐలు మాత్రం ఉధృతంగా కొనుగోళ్లు జరుపుతున్నాయి. దీనివల్లే మార్కెట్లు అప్‌మూవ్‌ కొనసాగిస్తున్నాయి. ఇలాంటి

12పాయింట్ల నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 21st December 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం స్వల్పంగా నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్స్ సూచీ ముగింపు(12290)తో పోలిస్తే 12 పాయింట్లు నష్టపోయి 12,278 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా, దేశీయంగా గానీ నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకపోతే సోమవారం నిఫ్టీ సూచీ స్వల్పంగా నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిన్నటి రోజుల ఉదయం సెషన్‌లో సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీలు వరుసగా

Most from this category