News


మిశ్రమంగా ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 19th October 2019
Markets_main1571468902.png-29004

అమెరికాలో ట్రేడయ్యే ఇండియా ఏడీఆర్‌లు శుక్రవారం అక్కడి మార్కెట్లో మిశ్రమంగా ముగిశాయి. ఫార్మారంగానికి చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ అత్యధికంగా 2శాతం లాభపడింది. ఐసీఐసీఐ ఏడీఆర్‌ అరశాతం ర్యాలీ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 1శాతం నష్టపోయింది. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 0.21శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.20శాతం నష్టపోగా, విప్రో ఏడీఆర్‌ మాత్రం ఎలాంటి లాభ, నష్టాలకు లోనుకాకుండా స్థిరంగా ముగిసింది
నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు:- 
టెక్నాలజీ, ఇండస్ట్రీస్‌, కన్జూమర్‌ సేవల షేర్లలో అమ్మకాలతో రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, బోయింగ్‌ కంపెనీ షేర్ల పతనంతో డౌజోన్స్‌ ఇండెక్స్‌ 225 పాయింట్లు(0.95శాతం) నష్టపోయి 26,770 వద్ద స్థిరపడింది. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ 12పాయింట్లు నష్టపోయి 2,986.20 వద్ద, నాస్‌డాక్‌ కాంపోసైట్‌ ఇండెక్స్‌ 67.31 పాయింట్లు పతనమైన 8,089.54 వద్ద స్థిరపడ్డాయి. ప్రధాన ఆర్థిక సూచికలు నెమ్మదించడం, ప్రపంచ రెండో అతిపెద్ద దేశమైన చైనా వృద్ధి రేటు 27 ఏళ్ల కనిష్టానికి నమోదు కావడం అమెరికా మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. చైనా మూడో త్రైమాసికంలో కేవలం 6శాతం వృద్ధిని నమోదు చేసింది. 



You may be interested

9నెలల్లో 25శాతం పెరిగిన పసిడి

Saturday 19th October 2019

దేశీయ పసిడి ధరకు రానున్న రోజుల్లో రూపాయి కదలికలు, అమెరికా-చైనాల వాణిజ్య చర్చలు కీలకం కానున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ కమోడిటీ అధిపతి హరీష్‌ వీ అభిప్రాయపడ్డారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం,  వాణిజ్య ఉద్రిక్తతలు, రూపాయి ట్రేడింగ్‌లో అస్థిరత వంటి కారణాలతో పసిడి ధర 9నెలల్లో 25శాతం ర్యాలీ జరిపింది.  రెండో త్రైమాసికపు చివర్లో 10గ్రాముల పసిడి ధర రూ.39,699 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. సెప్టెంబర్‌-డిసెంబర్‌ మధ్య వివాహాలు,

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై బ్యాంకుల ప్రతిపాదనకు ఆర్‌బీఐ ‘నో’

Saturday 19th October 2019

-డిసెంబర్‌ త్రైమాసికంలో తగ్గనున్న బ్యాంకుల లాభాలు   దివాన్‌ హౌసింగ్‌ పైనాన్స్‌కు(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) రుణాలిచ్చిన బ్యాంకులు, రూ. 6,000 కోట్ల వరకు ప్రొవిజన్ల ఉపశమనాన్ని పొందేందుకు సిద్ధంచేసిన ప్రతిపాదనలను ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) తిరస్కరించిందని పరిశీలకులు తెలిపారు. ఫలితంగా డిసెంబర్‌ త్రైమాసికానికిగాను ఈ బ్యాంకుల లాభం తగ్గనుంది. బ్యాంకులు, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించి మొత్తంగా రూ. 40,000 కోట్ల ఎక్స్‌పోజర్‌ను కలిగివున్నాయి. అందువలన ఈ రుణదాతలు డిసెంబర్‌ త్రైమాసికం చివరినాటికి 15 శాతం

Most from this category