News


అమెరికా మార్కెట్‌ జోరు... టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ డౌన్‌

Saturday 7th December 2019
news_main1575712769.png-30110

అమెరికాలో మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌కు చెందిన అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌)లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. టాటా మోటర్స్‌ అత్యధికంగా 1.81శాతం నష్టపోయింది. విప్రో, ఐసీఐసీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు అరశాతం క్షీణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ స్వల్పంగా 0.10శాతం నష్టపోయింది. మరోవైపు ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అరశాతం లాభపడింది. వేదాంత 0.37శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.08శాతం లాభాల్లో ముగిశాయి. 
భారీ లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు:- 
చైనాతో వాణిజ్య ఒప్పంద ఖరారు అశలు, బలమైన ఉద్యోగ గణాంకాల నమోదు కారణాలతో శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆ దేశ ప్రధాన సూచీలైన డో జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావనేజ్‌ 337 పాయింట్లు లాభపడి  28,015 వద్ద, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 28.48 పాయింట్లు పెరిగి 3,146 వద్ద, నాస్‌డాక్‌ కాంపోసైట్‌ 86 పాయింట్లను ఆర్జించి 8,656 వద్ద స్థిరపడ్డాయి. అనుకున్న గడువుకు ముందే యూఎస్-చైనా వాణిజ్య చర్చలు విజయవంతం కావచ్చని అంచనాలతో ఇన్వెస్టర్లు రిస్క్‌ అసెట్స్‌ అయిన ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు మొగ్గచూపారు. మరోవైపు నిన్నరాత్రి అమెరికా నవంబర్‌ మాసపు ఉద్యోగ గణాంకాలు విడుదల చేసింది. ఈ నవంబర్‌లో 1.8లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరగవచ్చని విశ్లేషకలు అంచనా వేశారు. అయితే అంచనాలకు మించి 2.6లక్షల కొత్త ఉద్యోగ సృష్టి జరిగింది. ఈ ఏడాది జనవరి తరువాత అత్యధికంగా ఉద్యోగ కల్పన జరగడం ఇదే తొలిసారి. ఆశాజనకమైన ఆర్థిక గణాంకాలతో యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్‌ పెరిగింది. దీంతో బ్యాంక్‌ షేర్లలో భారీగా కొనుగోళ్లు నెలకొన్నాయి. 



You may be interested

పన్ను రేట్ల తగ్గింపు...వృద్ధి పెంపుపై దృష్టి: ఆర్థిక మంత్రి సీతారామన్‌

Saturday 7th December 2019

కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రణాళికల్లో  భాగంగా ‘‘పన్ను రేట్ల తగ్గింపు’’ ప్రతిపాదన పై కూడా ఆలోచనలు చేస్తున్నటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో శనివారం సీతారామన్ వివిధ ఆర్థిక సమస్యలపై స్పందించారు. పన్నుల వ్యవస్థను మరింత సులభం చేయడంతో పాటు ఎలాంటి వేధింపులు లేకుండా చేస్తామని తెలిపారు. మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే దిశగా ఉద్దీపన అంశాలపై ఆర్థికవేత్తల సలహాలను వింటున్నామన్నారు. జీఎస్‌టీపై ఆందోళన

2020 డిసెంబర్‌ కల్లా సెన్సెక్స్‌ 45,500

Saturday 7th December 2019

వచ్చే ఏడాది డిసెంబర్‌ చివరినాటికి నిఫ్టీ 13, 400 స్థాయిని నమోదు చేస్తుందని కోటక్‌ సెక్యూరిటీ అంచనా వేస్తుంది. సెన్సెక్స్‌ సైతం 45,500 స్థాయిని అందుకోగలదని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది. ‘‘నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని కార్పొరేట్ల లాభాలు ఆర్థిక సంవత్సరం 2019-20లో 10శాతం, ఆర్థిక సంవత్సరం 2020-21లో 27శాతం చొప్పున పెరుగుతాయి. గడిచిన మూడేళ్లలో నిఫ్టీ-50 సీఏజీఆర్‌ 8శాతంగా నమోదైన నేపథ్యంలో వచ్చే మూడేళ్ల కాలానికి సీఏజీఆర్‌ 18శాతం వృద్ధిని ఆశిస్తున్నాము.’’

Most from this category