News


ఇండియా మార్ట్‌ రూ.213 కోట్ల సమీకరణ

Saturday 22nd June 2019
Markets_main1561186127.png-26498

వచ్చేవారంలో ఐపీఓకు రానున్న ఇండియామార్ట్‌ కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.213 కోట్లను సమీకరించింది. ఈ మేరకు కంపెనీ స్టాక్‌ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. సోమవారం(జూన్‌ 24న) ప్రారంభం ప్రారంభం కానున్న ఇష్యూలో భాగంగా 15మంది యాంకర్‌ ఇన్వెస్టర్లకు ప్రతి ఈక్విటీ షేరు ధర రూ.973 చొప్పున 22లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఇష్యూలో ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌, బిర్లా మ్యూచువల్‌ ఫండ్‌, హార్న్‌బిల్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ లాంటి 15 కంపెనీలు ఈ ఇష్యూలో పాల్గోన్నాయి. 
కొత్త ప్రభుత్వంలో తొలి ఐపీఓ ఇష్యూ:-
ఏడాది ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో ఐపీఓ మార్కెట్‌కు రానున్న తొలికంపెనీగా ఇండియామార్ట్‌ రికార్డు కెక్కనుంది. ఈ ఐపీఓ ఇష్యూ ఈ నెల 24న మొదలై 26న ముగియనుంది. ఐపీఓ ప్రక్రియలో భాగంగా కంపెనీ మొత్తం 48,87,862 ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ధర శ్రేణిని రూ.970-973గా నిర్ణయించింది. ఇండియామార్ట్‌ వ్యాపారోత్పత్తులు, సేవల ఆన్‌లైన్‌ బీ-2-బీ మార్కెట్‌ప్లేస్‌ రంగంలో సేవలు అందిస్తుంది. 



You may be interested

జైన్‌ ఇరిగేషన్‌కు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేసిన ఫిచ్‌

Saturday 22nd June 2019

ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌... ఇరిగేషన్‌ రంగంలో సేవలను అందించే జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ కంపెనీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. గతంలో తాము కంపెనీకి కేటాయించిన బి(+) రేటింగ్‌ను బి(-)కు రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు రేటింగ్ తెలిపింది. అలాగే కొత్తగా కంపెనీని ‘రేటింగ్ వాచ్ నెగిటివ్’ (ఆర్‌డబ్ల్యూఎన్)లో చేర్చినట్లు ఫిచ్‌ తెలిపింది. నిర్వహణ ప్రదర్శన అంచనాల కంటే తక్కువగా ఉండటంతో కంపెనీ పరిపతి, లిక్విటిడీ క్షీణించాయి. వర్కింగ్‌ క్యాపిటల్‌ పోజిషన్లు

1400డాలర్లపై ముగిసిన పసిడి ధర

Saturday 22nd June 2019

ప్రపంచమార్కెటో పసిడి ధర 6ఏళ్ల సుధీర్ఘ విరామం తొలిసారి 1400డాలర్ల పైన ముగిసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రికత్తలు, వడ్డరేట్లపై ఈసీబీ, ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంకుల మెతక వైఖరీ, క్రూడాయిల్‌ ధరల అస్థిరత, డాలర్‌ ఇండెక్స్‌ 3నెలల కనిష్టానికి పతనం తదితర అంశాలు ఇందుకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి పసిడి ఫ్యూచర్ల వైపు మళ్లిస్తున్నారు. నిన్నటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒకనొకదశలో 20డాలర్ల వరకు

Most from this category