News


ఇండియా మార్ట్‌ లిస్టింగ్‌ బంపర్‌ హిట్‌

Thursday 4th July 2019
Markets_main1562222195.png-26784

గతవారంలో ఐపీఓ ఇష్యూను పూర్తి చేసుకున్న ఇండియామార్ట్‌ షేర్లు గురువారం ఎక్చ్సేంజీల్లో ఘనంగా లిస్ట్‌ అయ్యాయి. ఐపీఓ ఇష్యూకు అద్భుతమైన స్పందన లభించటం, మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొని ఉండటంతో ఇష్యూ ధర(రూ.973.00)తో పోలిస్తే 21శాతం ప్రీమియంతో రూ.1180.00 వద్ద లిస్ట్‌ అయ్యాయి. బీఎస్‌ఈలోని ఇంట్రాడేలో ఒక దశలో 37.61శాతం వరకు లాభపడి రూ.1339.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఉదయం గం.11:30ని.లకు షేరు ఇష్యూ ధర(రూ.973.00)తో పోలిస్తే 30శాతం లాభంతో రూ.రూ.1265.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఐపీఓకు స్పందన అదుర్స్‌:- 
ఐపీఓకు అద్భుత స్పందన లభించింది. జూన్‌ 24-26 తేదీల మధ్య ఇష్యూను పూర్తి చేసుకున్న ఈ ఐపీఓకు 36.16 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. మొత్తం 26.92 లక్షల షేర్లకు గాను 9.74 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. వ్యాపార అవసరాల నిమిత్తం రూ.475 కోట్ల నిధుల సమీకరణ కోసం వచ్చిన ఈ ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.970-973గా నిర్ణయించింది. ఈ ఇష్యూకు లీడ్‌ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఎడెల్వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, జెఫ్పారీస్‌ కంపెనీలు వ్యవహరించాయి.



You may be interested

ఏడాది గరిష్ఠానికి 18 షేర్లు

Thursday 4th July 2019

ఎన్‌ఎస్‌ఈ గురువారం(జులై 4) ఇంట్రాడే ట్రేడింగ్‌లో సుమారుగా 18 స్టాకులు తమ ఏడాది గరిష్ఠాన్ని తాకాయి. అదానీ పవర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజస్‌, మంధాన ఇండస్ట్రీస్‌, ఓబెరాయ్‌ రియాల్టి స్టాకులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఆర్‌ఈసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్‌, సైమెన్స్‌ అండ్‌ టొరంటో పవర్‌ స్టాకులు కూడా తమ 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్‌ 0.26 శాతం

50,000 పాయింట్ల స్థాయికి సెన్సెక్స్‌: మోతిలాల్‌ ఓస్వాల్‌

Thursday 4th July 2019

ప్రాథమిక సమస్యగా ఉన్నది రియల్‌ ఎస్టేట్‌ రంగమే ప్రభుత్వ పాలసీకి  చిహ్నంగా బడ్జెట్‌: మోతిలాల్‌ ఓస్వాల్‌  బీజేపీ అధిక మెజార్టీతో రెండవసారి అధికారంలోకి వచ్చింది. ఇలాంటి సమయంలో విదేశి పెట్టుబడులను ఆకర్షించడానికి కార్పోరేట్‌ సంపాదన వృధ్ది చాలా అవసరమని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ సీఎండీ మోతిలాల్‌ ఓస్వాల్‌ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌​రంగంలోని కొన్ని కంపెనీలకు ప్రమాదకర రుణాలను ఇవ్వడం వలనే ఎన్‌బీఎఫ్‌సీలు సమస్యల్లో చిక్కుకున్నాయని ఆయన ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన

Most from this category