News


ఇండియా మార్ట్‌ ఐపీఓకు సెబీ ఓకే

Tuesday 18th September 2018
Markets_main1537250910.png-20351

అవన లాజిస్టెక్‌ ఐపీఓకు కూడా
న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌, ఇండియామార్ట్‌ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ ‘సెబీ’... ఆమోదం తెలిపింది. ఈ కంపెనీతో పాటు అవన లాజిస్టెక్‌ కంపెనీ ఐపీఓకు కూడా సెబీ పచ్చజెండా ఊపింది. ఐపీఓలో భాగంగా ఇండియామార్ట్‌ కంపెనీ 42.88 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.600 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, జెఫరీస్‌ ఇండియాలు వ్యవహరిస్తాయి.
అవన లాజిసిస్టెక్‌ ఐపీఓ...
అవన లాజిస్టెక్‌ కంపెనీ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో 43 లక్షల షేర్లను విక్రయించనున్నది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, కోల్డ్‌ స్టోరేజ్‌లు, గిడ్డంగిల నిర్మాణానికి, కంటైనర్ల కొనుగోళ్లకు వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌ కంపెనీలు వ్యవహరిస్తాయి. ఈ రెండు కంపెనీల ఐపీఓలకు ఆమోదంతో ఈ ఏడాది సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య 50కు పెరిగింది.



You may be interested

బీఓబీ ఎందుకు తగ్గింది?..దేనా పెరిగిందెందుకు?

Tuesday 18th September 2018

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా బ్యాంకింగ్‌ విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మెరుగైన బ్యాంకుగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) షేరు మంగళవారం నిట్టనిలువునా పతనంకాగా, భారీ ఎన్‌పీఏలతో అధ్వాన్న బ్యాంక్‌గా స్వయానా రిజర్వుబ్యాంక్‌తో ముద్రవేయించుకున్న దేనా బ్యాంక్‌ షేరు భారీగా పెరిగింది. ఒక వైపు బీఓబీ షేరు 14 శాతం వరకూ పతనమై 52 వారాల కనిష్టస్థాయి రూ. 116 వద్దకు పడిపోగా, దేనా బ్యాంక్‌

జీవీకే పవర్‌పై ఎన్‌సీఎల్‌టీకి ఫిర్యాదు

Tuesday 18th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జీవీకే పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రుణదాతల నుంచి షాక్‌ తగిలింది. 540 మెగావాట్ల గోయింద్వాల్‌ సాహిబ్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు విషయమై జీవీకే నుంచి రావాల్సిన బకాయిల పరిష్కారం కోసం ఐడీబీఐ బ్యాంకు నేతృత్వంలోని రుణ సంస్థలు ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బ్రాంచ్‌ను ఆశ్రయించాయి. జీవీకే పవర్‌ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే సోమవారం 4.94 శాతం పెరిగి రూ.10.84 వద్ద స్థిరపడింది.

Most from this category