News


భారీగా పడిపోయిన ఇండియాబుల్స్‌

Friday 2nd August 2019
Markets_main1564741422.png-27506

రూ.లక్ష​కోట్ల మోసానికి పాల్పడిందనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 8.61 శాతం నష్టపోయి రూ. 477.00 వద్ద ముగిసింది. ఇండియాబుల్స్‌ రూ.1 లక్ష కోట్ల మోసం చేసినట్లు ఆరోపిస్తూ బిజెపి నాయకుడు సుబ్రమణియన్ స్వామి పిఎం మోడీకి లేఖ పంపిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది. నేషనల్‌ హౌసింగ్‌ బోర్డు నుంచి రూ. లక్ష కోట్లను మోసం  చేసిందనే సుబ్రమణ్యం లేఖ సామాజిక మాధ్యమాలలో హల్‌చల్‌ చేస్తోంది.  ఎన్‌హెచ్‌బి నుంచి ఇండియాబుల్స్ హౌసింగ్‌కు ఎటువంటి రుణాలు లేవని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.  



You may be interested

మార్కెట్లో మూడొంతుల కరెక్షన్‌ ముగిసినట్టే..!

Saturday 3rd August 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పతనం కొనసాగుతుండగా... రూ.55,000 కోట్ల ఆస్తుల నిర్వహణ చూసే ప్రముఖ మనీ మేనేజర్‌ మాత్రం ప్రస్తుత మార్కెట్‌ కరెక్షన్‌లో అధిక భాగం ముగిసినట్టేనని అంచనా వేస్తున్నారు. ‘‘కంపెనీల ‍త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడం మార్కెట్‌ దిద్దుబాటుకు ప్రధాన కారణం. ఆర్థిక సేవల రంగంలో ఒత్తిళ్లు, ఆర్థిక రంగంలో డిమాండ్‌ మందగించడం, ముఖ్యంగా ఆటో రంగంలో’’అని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఐవో సంపత్‌రెడ్డి తెలిపారు. బెంచ్‌ మార్క్‌

సెన్సెక్స్‌ లాభం 100 పాయింట్లు

Friday 2nd August 2019

ట్రేడింగ్‌లో లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు వారాంతాన్ని స్వల్ప లాభంతో ముగించాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభపడి 37,118.22 స్థిరపడింది. నిఫ్టీ 17పాయింట్లు పెరిగి 10,997.00 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయి 28,204.95 వద్ద స్థిరపడింది. అటో, ఐటీ, ఆర్థిక, ఫైనాన్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది, మెటల్‌, మీడియా, బ్యాంకింగ్‌, రియల్టీ రంగ షేర్లు

Most from this category