News


ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గరిష్ట స్థాయి నుంచి పతనం

Tuesday 22nd October 2019
Markets_main1571737657.png-29058

బ్రోకరేజ్‌ సంస్థల రేటింగ్‌ అప్‌గ్రేడ్‌తో మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 9శాతం ర్యాలీ చేసిన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు మిడ్‌సెషన్‌ సమయానికి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.239.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కేర్‌ రేటింగ్‌ సంస్థ కంపెనీ ధీర్ఘకాలిక రుణ రేటింగ్‌ను కేర్‌ ఎఎ(+)గానూ, స్వల్పకాలిక రుణ రేటింగ్‌ను కేర్‌ ఎఎగానూ అప్‌గ్రేడ్‌ చేసింది. బ్రిక్స్‌ రేటింగ్‌ సంస్థ సైతం కంపెనీ రేటింగ్‌ను బీడబ్ల్యూఆర్‌ ఎఎఎ నుంచి ఎఎ(+)కు సవరించింది. ఫలితంగా ఈ కంపెనీ షేర్లు నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 11శాతం లాభపడి రూ.252.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం ఈ షేర్లు భారీ పతనాన్ని చవిచూసాయి. ఇంట్రాడే గరిష్టం రూ.252.00 నుంచి 18శాతం క్షీణించి రూ.206.00 కనిష్టానికి పతమనమయ్యాయి. మధ్యాహ్నం గం.3:00లకు షేరు క్రితం ముగింపు(రూ.231.20)తో పోలిస్తే 12శాతం నష్టంతో రూ. 219.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది, కనిష్ట ధరలు వరుసగా రూ.165.80లు రూ.919.40లుగా నమోదయ్యాయి. 



You may be interested

కోటక్‌ మహీంద్రా బ్యాంకు లాభం 51 శాతం అప్‌

Tuesday 22nd October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికానికి కోటక్‌ మహీంద్రా బ్యాంకు అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. త్రైమాసిక ఫలితాల్లో కీలకాంశాలు... బ్యాంకు నికర లాభం గతేడాదితో పోలిస్తే 51 శాతం పెరిగి రూ. 1724.5కోట్లకు చేరింది. అనలిస్టుల సరాసరి అంచనా లాభం రూ. 1555 కోట్లు మాత్రమే. బ్యాంకు గతేడాది క్యు2లో రూ. 1142 కోట్ల లాభం నమోదు చేసింది. తాజా త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 25.2 శాతం పెరిగి రూ. 2676

ఐటీ షేర్లకు ‘‘ఇన్ఫీ’’ దెబ్బ

Tuesday 22nd October 2019

ఇన్ఫోసిన్‌ నష్టాల సెగలు తన సహచర ఐటీ షేర్లను తాకాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ దాదాపు శాతం నష్టపోయింది. కంపెనీ యాజమాన్యం ఆదాయం, లాభాలను పెంచి చూపుతందని విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదుతో నేడు ఇన్ఫోసిస్‌ షేర్లు 16శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ఇన్ఫీ షేర్ల భారీ పతనంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 4.75 శాతం క్షీణించి 14,685.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని

Most from this category