News


ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇంట్రాడేలో 5 శాతం లాభం‍తో..

Thursday 20th June 2019
Markets_main1561011214.png-26433

ఎన్‌సీడీ బై బ్యాక్‌ల ప్రకటనే కారణం
ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గురువారం ఇంట్రాడేలో 5 శాతం లాభపడి రూ.582.55 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ ఈ ఏడాది జులై, ఆగష్టులలో మెచ్చ్యుర్‌ అయ్యే కన్వర్ట్‌బుల్‌ కానీ రూ.2,285 కోట్ల డిబెంచర్స్‌ను తిరిగి కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో షేరు లాభపడుతోంది. కంపెనీ లిక్విడిటీ బలంగా ఉందని సెప్టెంబర్‌ 21, 2018 నుంచి ఇప్పటి వరకు  బ్యాంక్‌ అప్పులు, బాండ్‌లు రూపేణ రూ.58,000 కోట్లు సమీకరించామని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ గగన్‌ బం‍గా తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద మిగులు నిల్వలు రూ.28,000ఉన్నాయని, మరో రూ. 11,000కోట్లు  మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టామని అన్నారు. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, దిరూబాయ్‌ అంబాని గ్రూప్‌లకు తాము ఎటువంటి ప్రమాదకర రుణాలు ఇవ్వలేదని వివరించారు. ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు కావడంతో గత వారం నష్టాల్లో ట్రేడయ్యింది. కానీ పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తి తన సంతకం ఎవరో ఫోర్జరి చేశారని తాను పిటిషన్‌ దాఖలు చేయలేదని కోర్టులోని పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్న విషయం తెలిసిందే.



You may be interested

ఐదేళ్ల గరిష్టానికి పసిడి ధర

Thursday 20th June 2019

వడ్డీరేట్ల తగ్గింపునకు ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు సంసిద్ధం కావడంతో పసిడి ధర పరుగులు పెడుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం పసిడి ధర ఏకంగా 5ఏళ్ల గరిష్టానికి ఎగిసింది. నేడు ఔన్స్‌ పసిడి ధర ఏకంగా 47డాలర్లు (3.50శాతం) పెరిగి 1395.35 డాలర్ల స్థాయిని తాకింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ నిన్నరాత్రి కీలక వడ్డీరేట్లపై యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. అయితే ఆర్థిక మందగమనం,  ద్రవ్యోల్బణం అంశాలను దృష్టిలో ఉంచుకొని

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ టార్గెట్‌ ధరను తగ్గించిన నోముర

Thursday 20th June 2019

ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌ గురువారం ఇంట్రాడేలో 1.31 శాతం నష్టపోయి రూ.131 వద్ద ట్రేడవుతోంది. జపాన్‌ బ్రోకరేజి సంస్థ నోముర తక్కువ సంపాదన అంచనాల నేపథ్యంలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేరు టార్గెట్‌ ధరను 7 శాతం తగ్గించింది. టార్గెట్‌ ధరను షేరుకు రూ.171 నుంచి రూ.159 కి తగ్గించి బై కాల్‌ను కొనసాగిస్తోంది. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ఓపెన్‌ ఆఫర్‌కు వెళ్లిన తర్వాత ఈ టార్గెట్‌ తగ్గింపు ఉండడం గమనార్హం. ‘‘మేము కంపెనీ

Most from this category