News


ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 7 శాతం అప్‌.!

Thursday 23rd January 2020
Markets_main1579768314.png-31136

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్‌) షేరు గురువారం మిడ్‌సెషన్‌ కల్లా 7శాతం లాభపడింది. నేడు ఈ షేరు బీస్‌ఈలో రూ.297.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ నుంచి ఆర్థిక సర్వీసు షేర్ల ర్యాలీలో భాగంగా నేడు ఈ షేరుకు కూడా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఒకదశలో 7.15శాతం లాభపడి రూ.317.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:15ని.లకు షేరు మునుపటి ముగింపు(రూ.296.25)తో పోలిస్తే రూ.296.25తో పోలిస్తే 6.21శాతం లాభంతో రూ.314.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.296.25లు, రూ.317.45లుగా నమోదయ్యాయి. ఇక ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో ఆర్థిక రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫైనాన్సియన్‌ సెక్టారు ఇండెక్స్‌ 0.75శాతం లాభంతో రూ.14,280.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

యస్‌ బ్యాంక్‌ షేరు దూకుడు

Thursday 23rd January 2020

ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌బ్యాంకు సమస్యల నుంచి బయటపడి మనుగడ సాగించేందుకు పరిష్కారమార్గాలు తప్పక దొరుకుతాయని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) చీఫ్‌ రజనీశ్‌ కుమార్‌ తాజాగా పేర్కొన్నారు. దేశీ ఫైనాన్షియల్‌ మార్కెట్‌లో యస్‌బ్యాంకు ఒక ప్రముఖమైన బ్యాంకు అంటూ దావోస్‌ సదస్సులో కితాబునిచ్చారు. ఇంత ప్రాముఖ్యమున్న బ్యాంకు కుప్పకూలే పరిస్థితి రాదన్నది తన అభిప్రాయమన్నారు. యస్‌బ్యాంకును సంక్షోభం నుంచి బయటపడేసేందుకు యత్నించాలని ప్రభుత్వం ఎస్‌బీఐని కోరవచ్చన్న అంచనాల మధ్య రజనీశ్‌ వ్యాఖ్యలు

భారత్‌ మార్కెట్లోకి గెలాక్సీ నోట్‌ ఎస్‌10 లైట్‌

Thursday 23rd January 2020

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ గతేడాది విడుదల చేసిన గెలాక్సీ నోట్‌ 10 కు అప్‌డేటెడ్‌ వెర్షన్‌ నోట్‌ 10 లైట్‌ను గురువారం వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈరోజు మద్యహ్నాం 2 గంటలనుంచి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభంకానున్నాయి. 6 జీబీ, 8జీబీ ర్యామ్‌లతో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ ఫిబ్రవరి 2 నుంచి అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లో  వినియోగదారులకు అందుబాటులో

Most from this category