STOCKS

News


ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ 18శాతం అప్‌

Thursday 28th November 2019
news_main1574932284.png-29930

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు గురువారం మిడ్‌సెషన్‌ సమయానికి 18శాతం వరకు లాభపడింది. నేడు ఈ కంపెనీ షేరు రూ.274.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరు కొనుగోలుకు ఇన్వెసర్లు ఆసక్తి కనబరచడంతో మిడ్‌సెషన్‌ కల్లా 18శాతం లాభపడి రూ.316.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్న గం.2:20నిల.కు షేరు క్రితం ముగింపు(రూ.268.10)తో పోలిస్తే 12.50శాతం లాభంతో రూ.301.65 వద్ద ట్రేడింగ్‌ వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరుసగా రూ.168.00, రూ.919.00 లుగా నమోదయ్యాయి. ఈ షేరు 5 ట్రేడింగ్‌ సెషన్‌లో 23శాతం, నెల రోజుల్లో 50శాతం ర్యాలీ చేసింది. ఏడాది కాలంలో 59శాతం మేర నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 
 



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీ మొండి ఆస్తుల కొనుగోలు భాద్యత ఆర్‌బీఐకి?!

Thursday 28th November 2019

ప్రభుత్వ యోచన ఎన్‌బీఎఫ్‌సీల వద్ద పేరుకుపోయిన మొండిపద్దులకు సంబంధించిన ఆస్తులను ఆర్‌బీఐ కొనుగోలు చేయాలని ప్రభుత్వం కోరుతున్నట్లు తెలిసింది. దేశంలో టాప్‌ 25 షాడో బ్యాంకులు(ఎన్‌బీఎఫ్‌సీలు) వద్ద ఉన్న ఒత్తిడిలో ఉన్న ఆస్తులు కొనేందుకు ఆర్‌బీఐ ఒక ఫండ్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు బ్యాంకులు కొన్ని రియల్టీ లోన్లను మొండిపద్దులుగా పరిగణించి వన్‌టైమ్‌ మాఫీ చేసేందుకు అనుమతించాలని కూడా ప్రభుత్వం

పాజిటివ్‌గా మెటల్‌ షేర్లు

Thursday 28th November 2019

దేశీయ మెటల్‌ షేర్లు గురువారం సెషన్లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.23 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.80 శాతం లాభపడి 2,649.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో జేఎస్‌డబ్యూ స్టీల్‌ 4.05 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 3.43 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 3.29 శాతం, జిందాల్‌ స్టీల్‌ 3.20 శాతం, టాటా స్టీల్‌ 2.23 శాతం, సెయిల్‌ 2.19 శాతం, కోల్‌ ఇండియా

Most from this category