News


ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ 11 శాతం క్రాష్‌..!

Wednesday 16th October 2019
Markets_main1571213436.png-28923

ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు బుధవారం 11శాతం నష్టపోయాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.189.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీలో తలెత్తిన పాలనాపరమైన సమస్యల కారణంగా ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ సంస్థ మూడీస్‌ ఐబీహెచ్‌ఎఫ్‌ కంపెనీకి చెందిన సీఎఫ్‌ఆర్‌(కార్పోరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌), ఫారెన్స్‌-కరెన్సీ సీనియర్‌ సెక్యూర్డ్‌ రేటింగ్‌ను బీఎ2 నుంచి బీ2కు కుదించింది. ఫలితంగా నిన్న ట్రేడింగ్‌ కంపెనీ షేర్లు 4.50శాతం నష్టపోగా, నేటి ట్రేడింగ్‌లో కూడా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కంపెనీ షేర్లు 12 శాతం నష్టపోయి రూ.166.95 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఈ ధర షేర్లకు ఆరేళ్ల కనిష్టస్థాయి కావడం గమనార్హం. మార్కెట్‌ ముగిసే సరికి 11శాతం నష్టపోయి రూ.168.45 వద్ద స్థిరపడింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.166.95లు రూ.976.80లుగా నమోదయ్యాయి. 



You may be interested

చిన్న ఇన్వెస్టర్ల చేతిలో యస్‌ బ్యాంక్‌

Wednesday 16th October 2019

క్యు2లో షేరుపై పెరిగిన చిన్న ఇన్వెస్టర్ల ఆసక్తి ఇటీవలి కాలంలో భారీగా పతనమైన యస్‌బ్యాంక్‌ షేరుపై చిన్న ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొన్ని త్రైమాసికాలుగా బ్యాంకు పరిస్థితి బాగాలేదు, పేలవ ఫలితాలు ప్రకటిస్తూవస్తోంది. ఇలాంటి షేర్లలో సాధారణంగా హైనెట్‌వర్త్‌ ఇన్వెస్టర్లు రిస్కీ పెట్టుబడులు పెడుతుంటారు. కానీ ఈ షేరులో హెచ్‌ఎన్‌ఐలతో పోటీగా చిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడులు యస్‌బ్యాంక్‌ కౌంటర్లో గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చూపుతున్నాయి. ముఖ్యంగా క్యు2లో ఈ పరిస్థితి

బ్రోకరేజ్‌లు టార్గెట్‌ పెంచిన షేర్లివే..!

Wednesday 16th October 2019

అమెరికా - చైనాల వాణిజ్య ఒప్పందం, ఆర్థిక రంగంలోని అనిశ్చితి, మార్కెట్‌ వర్గాలు ప్రభుత్వం నుంచి మరిన్ని ఉద్దీపన చర్యలు ఆశించడటం లాంటి ప్రతికూలాంశాలు నెలకొన్న నేపథ్యంలో దేశీయ కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలకు విడుదలకు సిద్ధమైమయ్యాయి. ఈ తరుణంలో క్యూ2 ఫలితాలు ఎలాంటాయోనని​మార్కెట్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కంపెనీల ఆదాయాలు ఆశించిన స్థాయిలో ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎఫ్‌ఎంజీసీ రంగానికి చెందిన అవెన్యూ సూపర్‌ మార్ట్‌,

Most from this category