News


ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ 18.82% ర్యాలీ

Friday 18th October 2019
Markets_main1571381196.png-28979

 ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ నెలలో మెచ్యుర్‌ కాబోతున్న ఎన్‌సీడీ(నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌)లను ముందుగానే విడిపించేందుకు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సిద్ధమవుతుండడంతో ఈ కంపెనీ షేరు విలువ శుక్రవారం ట్రేడింగ్లో 18.80 శాతానికి పైగా ర్యాలీ చేసి రూ. 235.20 వద్ద ముగిసింది. గత సెషన్‌లో 14.4 శాతం జంప్  చేసి 197.95 వద్ద ముగిసిన ఈ కంపెనీ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 198.00 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ. 259.95 వద్ద గరిష్ఠాన్ని తాకింది. క్రితం రోజు కనిష్టస్థాయి రూ. 166 నుంచి ఇప్పటి వరకు ఈ షేరు 40 శాతంకి పైగా పెరగడం విశేషం.



You may be interested

రిటైల్‌ ఇన్వెస్టర్లు మక్కువ చూపిన షేర్లివే!

Friday 18th October 2019

యస్‌బ్యాంకుపై అధికాసక్తి సెప్టెంబర్‌ త్రైమాసికంలో యస్‌ బ్యాంక్‌ సహా కొన్ని షేర్లపై రిటైలర్లకు మక్కువ పెరిగినట్లు గణాంకాలు చూపుతున్నాయి. తాజాగా యస్‌బ్యాంకులో రిటైలర్‌ మదుపరుల సంఖ్య 13లక్షలను దాటింది. బడా కంపెనీలైన ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, ఇన్ఫీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటాదారుల్లో రిటైలర్ల సంఖ్య కన్నా యస్‌బ్యాంకులో రిటైల్‌ వాటాదారుల సంఖ్య ఎక్కువ. యస్‌బ్యాంకుతో పాటు బీఓబీ, విప్రో, టాటామోటర్స్‌, టీసీఎస్‌, బయోకాన్‌ తదితరాల్లో క్యు2లో పెరిగింది. రిటైల్‌

‘‘భెల్‌’’ 29 శాతం హై జంప్‌

Friday 18th October 2019

ప్రభుత్వ రంగ విద్యుత్ పరికరాల తయారీ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల మోత మోగిస్తున్నాయి. కంపెనీలో కంపెనీలో ప్రభుత్వం వాటా తగ్గించుకోవచ్చనే వార్తలు వెలుగులోకి రావడం ఇందుకు కారణమవుతున్నాయి. నేడు ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో రూ.49.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భెల్‌ కంపెనీ పాటుతో ఎన్‌ఎండీసీలోనూ ప్రభుత్వం వాటాను తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సీఎస్‌బీసీ మీడియా తెలిపింది. ఈ ఆర్థిక

Most from this category