News


4నెలల కనిష్టానికి ఇండియాబుల్స్‌హౌసింగ్‌

Wednesday 12th June 2019
Markets_main1560327010.png-26251

  • రెండు రోజుల్లో 15శాతం క్రాష్‌
  • 10కోట్ల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ హుష్‌కాకి..!

దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్‌ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్ల పతనం బుధవారం 4నెలల కనిష్టానికి పతనమయ్యాయి. రూ.96 వేల కోట్ల ప్రజాధనాన్ని డైరెక్టర్లు, ఛైర్మన్‌ దారి మళ్లించారని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇన్వెస్టర్‌గా చెప్పుకుంటున్న అభయ్‌ యాదవ్‌ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ ధాఖలు చేశారు.  ఈ నిధుల దుర్వినియోగంపై లోతైన విచారణ జరిపించాలని పిటిషర్‌ కోర్టును కోరారు. ఫలితంగా నిన్నటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనై 8శాతం క్షీణించి రూ.674.55 వద్ద స్థిరపడ్డాయి. క్రితం ట్రేడింగ్‌ నష్టాలకు కొనసాగింపుగా నేటి ట్రేడింగ్‌లో సైతం కంపెనీ షేర్లు మరో 8శాతం నష్టపోయి రూ.622.45ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఈ ధర షేరుకు 4నెలల కనిష్టస్థాయి కావడం విశేషం. రెండు రోజుల్లోనే కంపెనీ షేర్లు ఏకంగా 15శాతం నష్టపోయాయి. అలాగే  కంపెనీ మొత్తం రూ.7,000 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ కోల్పోయింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు షేర్లు గత ముగింపు ధర(రూ.674.55)తో పోలిస్తే రూ.7.20 శాతం నష్టంతో రూ.625.95ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1,397.00, రూ.575.35లుగా నమోదయ్యాయి. 
ఇ‍క ఇదే సమయానికి సెన్సెక్స్‌ 275 పాయింట్లను కోల్పోయి 39,675 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 11,882 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

రికవరి బాటలో పసిడి ధర

Wednesday 12th June 2019

రికవరి బాటలో పసిడి ధర క్రితం ట్రేడింగ్‌లో వారం కనిష్టానికి పతనమైన పసిడి ధర బుధవారం రికవరీ బాట పట్టింది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో 10డాలర్లు లాభపడింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,341.35డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా, అమెరికా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ తెరపైకి రావడంతో మార్కెట్ల సెంటిమెంట్‌ బలహీనపడింది. ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు

పెరిగిన బంగారం ధరలు

Wednesday 12th June 2019

సాక్షి: అంతర్జాతీయంగా వీస్తున్న సానుకూల సంకేతాలు, ఈక్విటీ మార్కెట్‌ల బలహీనతల వలన గోల్డ్‌ ప్యూచర్‌ ధరలు బుధవారం పెరిగాయి. అమెరికాచైనా ట్రేడ్‌వార్‌ భయాల నడుమ ఈక్విటీ మార్కెట్‌లోని బలహీనతలు బంగారం వైపు ఇన్వెస్టర్లను ఆకర్షితులను చేస్తున్నాయి. దీనితో పాటు ప్రపంచంలోనే అతి పెద్దదైన గోల్డ్‌ బ్యాక్డ్‌ ఎక్సెంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌  ఎస్‌పీడీఆర్‌ నిల్వలు తగ్గడం కూడా బంగారం పెరగడానికి కారణంగా ఉంది. సోమవారం 756.42 టన్నులున్న ఈ నిల్వలు మంగళవారం

Most from this category