News


ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ 18% పతనం!

Thursday 10th October 2019
Markets_main1570690569.png-28803

 గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో  లక్ష్మీ విలాస్‌ బ్యాంకు(ఎల్‌వీబీ)ను విలీనం చేసే ప్రతిపాదనలకు ఆర్‌బీఐ అనుమతి నిరాకరించడంతో గురువారం ట్రేడింగ్లో ఈ రెండు సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 12.51 సమయానికి ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 18.02 శాతం నష్టపోయి రూ. 196.60 వద్ద ట్రేడవుతోంది. కాగా లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ 4.82 శాతం నష్టపోయి రూ. 25.65 వద్ద లోయర్‌ సర్యూట్‌ ఫ్రీజ్‌ అయ్యింది.
వీలీనానికి నో..
  లక్ష్మీ విలాస్‌ బ్యాంకు(ఎల్‌వీబీ)లో, గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ విలీన ప్రతిపాదనకు ఆర్‌బీఐ అనుమతిని ఆర్‌బీఐ నిరాకరించింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌ కమర్షియల్‌ క్రెడిట్‌లను లక్ష్మీ విలాస్‌ బ్యాంకులో స్వచ్ఛంద విలీనానికి చేసుకున్న దరఖాస్తును ఆమోదించడం లేదంటూ ఆర్‌బీఐ ఈ నెల 9న(బుధవారం) లేఖ ద్వారా తెలియజేసినట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు లక్ష్మీ విలాస్‌ బ్యాంకు తెలియజేసింది. విలీనానికి అనుమతి కోరుతూ ఎల్‌వీబీ ఈ ఏడాది మే 7న దరఖాస్తు చేయడం గమనార్హం. కాగా, భారీగా ఎగబాకిన మొండిబకాయిలు, తగినంత మూలధనం లేకపోవడం వంటి ప్రతికూలతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎల్‌వీబీపై ఇటీవలే ఆర్‌బీఐ ఆంక్షలు(సత్వర దిద్దుబాటు చర్యలు) విధించిన సంగతి తెలిసిందే. 



You may be interested

నిప్టీ 75, సెన్సెక్స్‌ 240 పాయింట్లు పతనం!

Thursday 10th October 2019

  యుఎస్‌-చైనా మధ్య జరిగిన డిప్యూటీ స్థాయి చర్చలలో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోవడంతో పాటు వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్‌ వచ్చిన చైనా ప్రతినిధులు షెడ్యుల్‌కి ముందే యుఎస్‌ను వీడనున్నారనే వార్తలు వెలువడడంతో గురువారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అదేవిధంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లోనే కదులుతున్నాయి. దీనికి తోడు ఆర్థిక సంవత్సరం 2020 రెండవ త్రైమాసికానికి సంబంధించి కార్పోరేట్‌ ఫలితాల ఒత్తిడి, బ్యాంకింగ్‌ షేర్లు

జియో ఛార్జీల పెంపుతో టెల్కోల జోరు

Thursday 10th October 2019

 రిలయన్స్‌ జియో, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించడానికి సిద్ధమవ్వడంతో గురువారం టెలికాం కంపెనీల (టెల్కోలు) షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌ కోసం నిర్దిష్ట చార్జీలను (ఐయూసీ) వసూల్‌ చేయడంతో జియో లాభం పెరగనుందని, అంతే కాకుండా ఈ రంగలోని పోటీ కంపెనీలయిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా కంపెనీల లాభాలు కూడా పెరగనున్నాయని విశ్లేషకులు తెలిపారు. ‍కాగా జియో తీసుకున్న

Most from this category