News


ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ 5 శాతం క్రాష్‌

Monday 9th December 2019
Markets_main1575887448.png-30133

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ షేరు వరుసగా 5రోజూ నష్టాల్లో ముగిసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.275.00 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభమైనప్పటి ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒకదశలో షేరు 6.75శాతం నష్టపోయి రూ.254.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 4.75 శాతం నష్టపోయి రూ.259.50 వద్ద స్థిరపడింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.168.00లు, రూ.919.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

12న ఆరంభం కానున్న బాండ్‌ ఈటీఎఫ్‌

Tuesday 10th December 2019

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు సెబీ సోమవారం అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 12న ఈటీఎఫ్‌ ఇష్యూ ప్రారంభమవుతుంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గత వారమే కేంద్ర ప్రభుత్వం భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ప్రారంభానికి అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే.    భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ మార్గంలో 12 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిధులు సమీకరించొచ్చని తెలుస్తోంది.

అక్కడక్కడే ముగిసిన మార్కెట్‌

Monday 9th December 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి స్వల్ప లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 42 పాయింట్లు పెరిగి 40, 487 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 11937 వద్ద ముగిసింది. తద్వారా సూచీల రెండురోజుల నష్టాలకు ముగింపు పడినట్లైంది. అటో, ఆర్థిక, మెటల్‌, ఫార్మా, ప్రైవేట్‌ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల

Most from this category