News


ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ 7% క్రాష్‌

Tuesday 15th October 2019
Markets_main1571117953.png-28891

 ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, షేర్ల బై బ్యాక్‌ చేయాలని ఆలోచిస్తున్నప్పటికి ఈ కంపెనీ షేరు మాత్రం గత కొన్ని సెషన్‌ల నుంచి నష్టాల్లో ట్రేడవుతోంది. అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ సంస్థ మూడీస్‌ ఈ కంపెనీ రేటింగ్‌ను బీఏ2 నుంచి బీ2 తగ్గించి, ఈ కంపెనీపై ప్రతికూల దృక్ఫథాన్ని కలిగి ఉండడంతో ఈ కంపెనీ షేరు గత సెషన్‌లో(అక్టోబర్‌ 14) 6 శాతానికి పైగా నష్టపోయింది. కాగా మంగళవారం సెషన్‌ ప్రారంభంలో (అక్టోబర్‌ 15) కూడా ఈ కంపెనీ షేరు విలువ 7 శాతానికి పైగా నష్టపోవడం గమనార్హం. 
  నిన్న జరిగిన కంపెనీ సమావేశంలో షేర్ల బై బ్యాక్‌ ఆప్షన్‌ను పరిశీలించాలని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నిర్ణయించింది. బై బ్యాక్‌కు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ(సెబీ) నుంచి ధృవీకరణ పొందిన తర్వాత బోర్డు సభ్యులు చివరి నిర్ణయాన్ని తీసుకుంటారని కంపెనీ పేర్కొంది. ‘బై బ్యాక్‌కు సంబంధించి న్యాయ సలహాలను విన్న తర్వాత కంపెనీ మొదట సెబీ వద్ద కంపెనీ యోగ్యతను దృవికరించుకోవాలని భావిస్తోంది. సెప్టెంబర్‌ 19, 2019 ప్రభుత్వ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఎన్‌బీఎఫ్‌సీ/హెచ్‌ఎఫ్‌సీలకు అనుబంధంగా ఉన్న సంస్థల డెట్‌-ఈక్విటీ నిష్పత్తి 6:1గా ఉండొచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఎన్‌బీఎఫ్‌సీ/హెచ్‌ఎఫ్‌సీలకు అనుబంధ సంస్థ కాకుండా, ఈ సంస్థనే ఒక పేరెంట్‌ కంపెనీ అయినాసరే ఈ నోటిఫికేషన్‌ వర్తిస్తుంది’ అని ఈ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొం‍ది. 
   రేటింగ్‌ కమిటీ ఐసీఆర్‌ఏ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌పై దీర్ఘకాలానికి గాను ఏఏ ప్లస్‌ రేటింగ్‌ను, స్వల్పకాలానికి గాను ఏ1 ప్లస్‌ రేటింగ్‌లను పునరుద్ఘాటించింది. వీటితో పాటు ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, మెచ్యురిటీ అయిన యాక్సి ట్రస్టీ రూ. 1,330 కోట్ల మసాలా బాండ్ల చెల్లింపులను చేసింది. ఉదయం 10.55 సమయానికి ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 2.68 శాతం నష్టపోయి రూ. 192.50 వద్ద ట్రేడవుతోంది.You may be interested

రిస్కీ పెట్టుబడులకు ఇదే సరైన సమయం!

Tuesday 15th October 2019

కొంత ఆలస్యమైనా బుల్‌రన్‌ తప్పదు ప్రముఖ ఇన్వెస్టర్‌ మధు కేలా దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌మార్కెట్‌ మరలా ఆరంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయని ప్రముఖ అనలిస్టు మధు కేలా చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయి బుల్‌దశకు కొంత సమయం పడుతుందని, కానీ రాబోయే బుల్‌మార్కెట్లో లాభార్జన చేయాలంటే పెట్టుబడులకు ఇప్పుడే మంచి తరుణమని సూచిస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా తాను కూడా రక్షణాత్మకంగానే వ్యవహరిస్తున్నానన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన స్టాకుల్లో ఎంటర్‌ కావచ్చని, ధైర్యే సాహసే లక్ష్మి

కోల్‌ ఇండియా, ఐటీసీకి జీఎస్‌టీ ముప్పు?!

Tuesday 15th October 2019

క్రమంగా తగ్గుతూ వస్తున్న జీఎస్‌టీ వసూళ్లు అంతిమంగా ఐటీసీపై నెగిటివ్‌ ప్రభావం చూపుతాయా? అవునంటున్నారు నిపుణులు. జీఎస్‌టీ వసూళ్లలో తరుగుదల పూడ్చుకునేందుకు ప్రభుత్వం పొగాకుపై పన్ను పెంచుతుందని ఎక్కువమంది నిపుణులు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఐటీసీపై నెగిటివ్‌ ప్రభావం ఉంటుందంటున్నారు. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తాజాగా ఐటీసీపై రేటింగ్‌ను ‘కొనొచ్చు’ నుంచి ‘న్యూట్రల్‌’కు తగ్గించింది. పొగాకుతో పాటు బొగ్గుపై కూడా అదనపు సెస్సు విధించే ఛాన్సులున్నాయని అంచనా వేసింది.

Most from this category