News


ఇండియాబుల్స్‌... ఉదయం ర్యాలీ, మధ్యాహ్నం పతనం

Friday 29th November 2019
Markets_main1575024925.png-29959

కేంద్ర మంత్రిత్వ శాఖ సానుకూల ‍ప్రకటనతో కోర్టు కేసులో సానుకూల వార్తలతో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్లో భారీగా లాభపడిన ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌ రియల్స్‌ ఎస్టేట్‌ షేర్లు మధ్యాహ్నం కల్లా భారీగా నష్టాలను చవిచూశాయి. కేసులో యాజమాన్య వాదనలకు ప్రభుత్వం నుంచి కొంత మద్దతు లభించడంతో పాటు సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజ్‌ సంస్థ షేరు టార్గెట్‌ను పెంచిన నేపథ్యంలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేరు ఇంట్రాడేలో 12.75శాతం పెరిగి రూ.376.80 వద్ద గరిష్టాన్ని అందుకుంది. 

నేడు ఈ కేసును తిరిగి ప్రారంభించిన హైకోర్టు... ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపేందుకు సెబీ, ఆర్‌బీఐ, ఎస్‌ఎఫ్‌ఐఓలకు మరింత గడువునిస్తూ వాదనలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియా బుల్స్‌ వెంచర్‌ లిమిటెడ్‌లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గరిష్ట స్థాయి(376.80) నుంచి 26శాతం నష్టపోయి రూ.279.40 వద్ద ట్రేడ్‌ కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం. 2:30ని.లకు షేరు క్రితం ముగింపుతో పోలిస్తే(334.20)తో పోలిస్తే 15శాతం నష్టంతో రూ.285.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే గ్రూప్‌నకు చెందిన ఇండియాబుల్స్‌ రియల్స్‌ ఎస్టేట్‌ కంపెనీ షేరు ఉదయం సెషన్లో 5శాతం పెరిగి రూ.75.10 వద్ద గరిష్టాన్ని అందుకుంది. ఈ షేరు సైతం మధ్యాహ్నం అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో గరిష్ట స్థాయి(75.10) నుంచి 10శాతం నష్టపోయి రూ.68.00 వద్ద ట్రేడ్‌ కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం. 2:30ని.లకు షేరు క్రితం ముగింపుతో పోలిస్తే(75.10)తో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.68.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

మొండి బకాయిల్ని దాస్తున్న ఎనిమిది బ్యాంకులు!

Friday 29th November 2019

ఎన్‌పీఏ(నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌)లుగా చూపాల్సిన మొండి బకాయిల్ని, బ్యాంకులు ఎంత మేరకు ఎన్‌పీఏలుగా గుర్తిస్తున్నాయో తెలుసుకునేందుకు ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) నాలుగేళ్ల తర్వాత బ్యాంకుల ఆస్తి నాణ్యతను సమీక్షించింది. కాగా ఈ సమీక్షలో కనీసం ఎనిమిది బ్యాంకులు నియంత్రణ సంస్థ అంచనాల కంటే తమ ఎన్‌పీఏలను తక్కువగా చేసి నివేదించడం గమనార్హం. అంతేకాకుండా నియంత్రణ సంస్థ నిర్ధేశించిన స్థాయి కంటే, ఈ బ్యాంకులు తక్కువగా  ప్రోవిజన్లను ఏర్పాటు చేశాయి.

రికార్డుల ర్యాలీకి బ్రేక్‌..!

Friday 29th November 2019

సూచీల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ 336.36 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ సూచీల రెండు రోజుల రికార్డుల ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌ పడింది. సూచీల జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ట్రేడర్ల లాభాల స్వీకరణ, నేడు రెండో క్వార్టర్‌ జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత ఇందుకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల వాతావరణం సెంటిమెంట్‌ను కొంతమేర దెబ్బతీసింది. మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 336 పాయింట్ల నష్టంతో 40,793.81 వద్ద స్థిరపడగా,

Most from this category