News


నిరుత్సాహకర ఫలితాలు: ఇండియన్‌బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 9శాతం క్రాష్‌

Wednesday 7th August 2019
Markets_main1565160215.png-27602

ఫైనాన్స్‌, హౌసింగ్‌ రంగంలో సేవలు అందిస్తున్న ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ షేర్లు బుధవారం  9శాతం పతనయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడటం షేరు పతనానికి కారణమైంది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ మొదటి క్వార్టర్‌ ఫలితాలు విడుదల చేసింది. ఈ క్యూ1లో కంపెనీ రూ.802 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో కంపెనీ సాధించిన రూ.1,055 కోట్లతో పోలిస్తే ఇది 24 తక్కువ. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.4,071.32 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా ఈ క్యూ1 కాలానికి కంపెనీ ఆదాయం రూ.3,886.12 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం 13శాతం క్షీణించి రూ.1,475 కోట్లకు పరిమితమైంది. గత క్యూ1లో ఇది రూ.1,690 కోట్లకు పరిమితమైంది. ఎన్‌పీఏ రేషియో 0.88శాతం నుంచి 1.47శాతంగా పెరిగడంతో ఆస్తుల నాణ్యత భారీగా క్షీణించింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ లోన్‌ బుక్‌ 10శాతం క్షీణించి రూ.1.13 ట్రిలయన్లుగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంకుతో విలీనానికి సీసీఐ నుంచి జూన్‌లో అనుమతులు లభించిందని, ఆర్‌బీఐ, స్టాక్‌ ఎక్చ్సేంజీల అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు కంపెనీ పేర్కోంది. ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు షేర్లు అమ్మకాలకు మొ‍గ్గుచూపారు. ఫలితంగా షేరు ఒకదశలో 9.50శాతం నష్టపోయి రూ.464.00ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం. 12:00లకు షేరు గత ముగింపు ధర(రూ.514.1)తో పోలిస్తే 6.50శాతం నష్టంతో రూ.470.25 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 458.00  రూ.1396.85లుగా నమోదయ్యాయి.



You may be interested

రెపోరేట్‌ 35 బీపీఎస్‌ తగ్గించిన ఆర్‌బీఐ

Wednesday 7th August 2019

లిక్విడిటీ పెంచడమే లక్ష్యం ద్వైమాసిక సమీక్షా సమావేశంలో భాగంగా రెపోరేట్‌ను 35 బీపీఎస్‌ మేర తగ్గిస్తున్నట్లు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఆరుగురు సభ్యులతో కూడిన మానిటర్‌ పాలసీ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో రెపోరేట్‌  5.40 శాతానికి దిగివచ్చింది. ఆర్బీఐ పెట్టుకున్న దీర్ఘకాలిక ద్రవ్యోల్బణ టార్గెట్‌కు దిగువనే నిజ ద్రవ్యోల్బణం కదలాడుతుండడంతో రేట్‌కట్‌కు ఆర్‌బీఐకి మార్గం సుగమమైంది. మార్కెట్‌ వర్గాలు 25 బీపీఎస్‌ రేట్‌కట్‌ ఉండొచ్చని అంచనా వేశాయి. గత

యస్‌ బ్యాంక్‌ 7 శాతం అప్‌

Wednesday 7th August 2019

7.50శాతం ర్యాలీచేసిన షేర్లు ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంకు షేర్లు బుధవారం 7శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.86.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ వారంలో ప్రారంభం కానున్న యస్‌ బ్యాంక్‌ క్యూఐపీ ఇష్యూలో ప్రైవేట్‌రంగ ఈక్విటీ సంస్థలైన జీఐటీ, వెస్ట్‌బ్రిడ్జ్‌ సంస్థలతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ సంస్థలు పాల్గొనవచ్చనే వార్తలు వెలుగులోకి రావడంతో ఈ యస్‌ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల డిమాండ్‌

Most from this category