News


ఇండియాబుల్స్ గ్రూప్ షేర్ల జోరు

Thursday 20th February 2020
Markets_main1582195185.png-31967

ఇండియాబుల్స్ గ్రూప్ కుదుర్చుకున్న ఒప్పందాలలో ప్రభుత్వం ఎటువంటి అవకతవకలను కనుగొనలేదనే నివేదికలతో ఈ గ్రూప్ షేర్లు 17శాతం వరకు పెరిగాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) దర్యాప్తులో ఇండియాబుల్స్ ఒప్పందంలో పెద్ద అవకతవకలు జరగలేదని తేలినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ సానుకూలాంశంతో...

  • ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇంట్రాడేలో 17.50శాతం పెరిగింది. మార్కెట్‌ ముగిసే సరికి 11శాతం లాభంతో రూ.338.30  వద్ద స్థిరపడింది. 
  • ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేడ్‌ సర్వీసెస్‌ షేరు ఇంట్రాడేలో 5శాతం అప్పర్‌ సర్కూ‍్యట్‌ తాకి రూ.102.75 వద్ద ఫ్రీజైంది.
  • ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ షేరు ఇంట్రాడేలో 5శాతం లాభపడి రూ.91.70 స్థాయికి చేరింది. చివరికి 2శాతం లాభంతో రూ.89.10 వద్ద స్థిరపడింది.
  • ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ షేరు ఇంట్రాడేలో 9.50శాతం పెరిగి రూ.220.00 స్థాయిని తాకింది. మార్కె్ట్‌ ముగిసే సరికి 8.36శాతం లాభంతో రూ.217.70 వద్ద ముగిసింది.


షెల్‌ కంపెనీల సృష్టించి తప్పుడు మార్గంలో నిధుల సమీకరించి వాటిని దారి మళ్లించారనే ఆరోపణలతో జూలై 2018లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ వెంచర్స్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలపై దర్యాప్తు ప్రారంభమైంది.

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ డిఎల్ఎఫ్, అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఏడీఏజీ), అమ్రికార్ప్‌కు ఇచ్చిన రుణాలను ఆయా కంపెనీలు తిరిగి పూర్తిగా చెల్లింపులు చేసినట్లు ఎంసీఎఏ కోర్టుకు సమర్పించిన దాఖలలో పేర్కోంది. వాటిక గ్రూప్, చోర్డియా గ్రూప్ అనే మరో రెండు సంస్థల రుణ ఖాతాలను “ప్రామాణిక ఖాతా” గా నివేదించినట్లు కూడా ఎంసీఏ తెలిపింది. 



You may be interested

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ మార్చి 2న ప్రారంభం

Thursday 20th February 2020

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విభాగమైన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 2న ప్రారంభం అవుతుంది. ఇటీవల ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించిన సంగతి  తెలిసిందే. ఎస్‌బీఐ కార్డ్స్‌లో ఎస్‌బీఐకి 76 శాతం, కార్లే గ్రూపుకు 24 శాతం వాటా ఉంది. దేశంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అతిపెద్ద రెండో క్రెడిట్‌ కార్డు

నష్టాల ముగింపు...నిఫ్టీ 45 పాయింట్లు డౌన్‌

Thursday 20th February 2020

153 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌ హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లు వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ ముందు రోజు హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒక్క రోజులోనే కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 153 పాయింట్లు క్షీణించి 41,170 వద్ద నిలవగా.. నిఫ్టీ 45 పాయింట్ల వెనకడుగుతో 12,081 వద్ద స్థిరపడింది. బుధవారం అమెరికా మార్కెట్లు సరికొత్త గరిష్టాల వద్ద నిలవడంతో

Most from this category