News


ఇండియాపై సీఎల్‌ఎస్‌ఏ అండర్‌వెయిట్‌!

Friday 15th November 2019
Markets_main1573811114.png-29619

‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల(ఈఎం)లో ఇండియా అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తుందని అంచనావేస్తున్నాం. నా సలహా ఏంటంటే ఈఎం మార్కెట్లలో మొదట ఉత్తరాసియా మార్కెట్లు ఔట్‌పెర్ఫార్మ్‌ చేస్తాయి. ఈ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాం’ అని సీఎల్‌ఎస్‌ఏ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ అడ్రియన్‌ మావత్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో...
డిమాండ్‌ తగ్గింది..
ప్రభుత్వం కార్పోరేట్‌ పన్ను రేటును 25 శాతానికి తగ్గించడంతో, మేము చూస్తున్న ఇతర దేశాల సరసన ఇండియా నిలిచింది. ఇండియాలోని వ్యాపారాలను అధిక ట్యాక్స్‌ రేటుతో నిరుత్సాహ పరచడంలో అర్ధం లేదనేది నా అభిప్రాయం. వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు, మొదట అక్కడి డిమాండ్‌ను పరిశీలిస్తారు. డిమాండ్‌ ఉంటేనే కొత్త ప్లాంట్‌లను విస్తరిస్తారు. ఒకవేళ  కంపెనీలు వాటి సామర్ధ్యం కన్నా తక్కువకు ఆపరేట్‌ చేస్తుంటే కొత్త ప్లాంట్లు లేదా మిషనరీలను ఏర్పాటు చేయడానికి పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు. మొత్తంగా ఇండియాలో వ్యాపార పెట్టుబడులకు సంబంధించిన సమస్యలు కంటే, డిమాండ్‌కు సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇండియా వినియోగాధారిత ఆర్థిక వ్యవస్థ కావడంతో, ఈ సమస్య ఆర్థిక వ్యవస్థపై అధికంగా ఉంది. తాము గ్రామాలలో లేదా పట్టణాలలోని గృహాల స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. 

ట్రేడ్‌వార్‌ ఇండియాకు సానుకూలమే..
ట్రేడ్‌ వార్‌ లేదా బ్రెగ్జిట్‌వంటి అంతర్జాతీయ అంశాలు భారత ఆర్థిక ‍వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపవు. బ్రెగ్జిట్‌ విషయమై చూస్తే బ్రిటన్‌లో వ్యాపారాలున్న కంపెనీలు నష్టపోతాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపదు. అదేవిధంగా వాణిజ్య యుధ్ద ప్రభావం చైనా, ఉత్తరాసియా వంటి అధికంగా ఎక్స్‌పోజర్‌ కలిగివున్న, ఓపెన్‌ ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువగా ఉంటుంది. హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌ వంటి దేశాలను పరిశీలిస్తే ఈ దేశాల ఆర్థిక వ్యవస్థ అధికంగా ట్రేడింగ్‌పై ఆధారపడివుంటుంది. అందుకే ఈ దేశాల జీడీపీ వృద్ధి రేటు కూడా వాణిజ్య యుద్ధ ప్రభావంతో పడిపోయింది. కానీ ట్రేడ్‌వార్‌... భారత ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపదు. ఇంకా చెప్పాలంటే చాలా మార్గాలలో ఇండియాకు ట్రేడ్‌వార్‌ సానుకూలమే. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులలో ఇండియా, ఇండోనేషియా వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో దాగేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇతర దేశాలలో కంటే అధికంగా వృద్ధి, ఈ దేశాలలో జరుగుతుండడంతో అధిక పీఈ మల్టిపుల్స్‌ను కూడా చెల్లించడానికి వెనుకాడరు. కానీ సమస్య ఏమిటంటే ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు అంచనాల కంటే తక్కువగా వృద్ధి చెందుతుండడమే. ఇండియా, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలు అధికంగా వృద్ధి చెందుతాయని ఈ దేశాలలో పెట్టుబడులు పెట్టి, ​ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. కానీ ఈ దేశాల కార్పొరేట్‌ నెంబర్లు, జీడీపీ నెంబర్లు అంచనాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. 

ఈఎం మార్కెట్ల ప్రదర్శన గొప్పగా లేదు..
   అంతర్జాతీయ వృద్ధి బలహీనంగా ఉన్న పరిస్థితులలో ఇండియా ఇప్పటికి కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థనే. కానీ గత మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా 12 నెలల కిందట వేసిన అంచనాలకు తగ్గట్టు వృద్ధి చెందడంలేదనేది వాస్తవం. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు గత పదేళ్ల కాలం నుంచి స్థిరంగా అండర్‌ పెర్‌ఫార్మ్‌ చేస్తున్నాయి. గత పదేళ్ల నుంచి ఇండియా కూడా ఈ అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలానే కదులుతోంది. ఇదే అమెరికాలో గత పదేళ్ల కాలంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కంటే 2.5 రెట్లు అధికంగా రిటర్న్‌లను పొందొచ్చు. ఇది చాలా పెద్ద సమస్య. విదేశీ ఇన్వెస్టర్లు, ఈ దేశాలు వాటి కార్పొరేట్‌ వృద్ధి అంచనాలను అందుకోకపోవడం వంటి కారణాల వలన అభివృద్ధి చెందుతున్న దేశాల గ్రోత్‌ స్టోరిస్‌పై ఇన్వెస్టర్లకు  నమ్మకం కరువవుతోంది. భారతదేశం వెలుపల కార్పొరేట్‌ లాభాల వృద్ధి రేటు కేవలం 7 శాతంగా ఉంది. ఇది అమెరికాలో 8 శాతానికి పైన ఉండడం గమనార్హం.

ఈఎం మార్కెట్లు ఆస్తిగా..
అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను ఒక ఆస్తిగా పరిగణిస్తే, ఇది ముప్పు కంటే చాలా దిగువన ఉంది. అంతేకాకుండా చాలా వరకు నిధులు పరోక్షంగా ఈ మార్కెట్లలోకి వెళుతోంది. ఇండియా కూడా ఇండెక్స్‌లో తనకున్న 8.2 శాతం  వెయిటేజ్‌ వలన తన వంతుగా ఇన్‌ఫ్లోలను, ఔట్‌ ఫ్లోలను పొం‍దుతుంది. ఈ ఎఫ్‌ఐఐల  ప్రవాహాలను కూర్చోని చూసే వాళ్లు, ఇదంతా ఇండియా గురించే అనుకుంటారు. కానీ ఇది అభివృద్ధిచెందుతున్న మార్కెట్లకు సంబంధించినది. ఈ ఏడాదిని గమనిస్తే నిధుల ఔట్‌ఫ్లో పరోక్ష, ప్రత్యక్ష ఈఎం ఫండ్స్‌ నుం‍చి జరుగుతోంది. ముందు చెప్పినట్టు ఇండియా, ఇండోనేషియా ఒకే స్థాయిలో ఉన్నాయి. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు వినియోగాధారితం. కానీ సమస్యేంటంటే ప్రస్తుతం దేశీయ వినియోగం, డిమాండ్‌ ప్రజలు ఊహిస్తున్నదాని కంటే చాలా తక్కువగా ఉంది. ముందుకెళ్లే కొద్ధి ఈ సమస్య నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత దృక్ఫథం మాత్రం బేరిష్‌గా, నిరాశవాదంతో ఉంది. 
    విదేశీ ఫండ్స్‌ కూడా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై అండర్‌వెయిట్‌ను కలిగివున్నాయి. ప్రస్తుతం మేము ఈ అధ్వాన్న పరిస్థితులను గురించి వారికి వివరించాడానికి ప్రయత్నిస్తున్నాం. వచ్చే ఏడాది అభివృద్ధి చెందుతున్న దేశాలలో కార్పొరేట్‌ లాభాల వృద్ధి 10 శాతం దాటుతుందని అంచనావేస్తున్నాం. ఇది అమెరికా కార్పొరేట్‌ లాభాల వృద్ధి కంటే చాలా ఎక్కువ. చాలా ఏళ్ల తర్వాత ఈఎం ఈపీఎస్‌ వృద్ధి... అమెరికా ఈపీఎస్‌ వృద్ధిని మొదటి సారి దాటనుంది. కానీ ఈ వృద్ధిని అధికంగా ఉత్తరాసియా నడిపించనుంది. సెమికండక్టర్స్‌ ప్రభావం అధికంగా ఉండడంతో, కొరియా, తైవాన్‌ వంటి అధికంగా సాంకేతికతకు ఎక్స్‌పోజ్‌ అయిన దేశాలు ఈ వృద్ధిని నడపనున్నాయి. చైనాలో ఈ-కామర్స్‌ కంపెనీల ఈపీఎస్‌ వృద్ధి ఈ ఏడాది 40 శాతంగా, వచ్చే ఏడాది 30 శాతంగా ఉండనుంది. అంతేకాకుండా చైనాలో సాంకేతికత కూడా బలపడడంతో అక్కడ కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. చైనా ఈఎం మార్కెట్లను నడిపిస్తుందని అంచనావేస్తున్నాం.    
    అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా అండర్‌పెర్ఫార్మ్‌ చేస్తుందని అంచనావేస్తున్నాం. నా అంచనా ఏంటంటే ఈఎం మార్కెట్లలో మొదట ఉత్తరాసియా మార్కెట్లు ఔట్‌పెర్ఫార్మ్‌ చేస్తాయి. ఈ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాం. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, ఆసియా పసిఫిక్‌ పోర్టుఫోలియోలో ఇండియాపై అండర్‌వెయిట్‌ను కలిగివున్నాం. ఇండియా ఈక్విటీ మార్కెట్లు పెరుగుతాయి, కానీ ఉత్తరాసియా మార్కెట్లంత ఉండదని అంచనావేస్తున్నాం. అంతేకాకుండా ఇండియా స్థూల ఆర్థిక డేటా ఇన్వెస్టర్లు జాగ్రత్త పడేట్టు చేస్తోంది. You may be interested

వోడాఫోన్‌ ఐడియా..కనిష్టం నుంచి 49శాతం అప్‌

Friday 15th November 2019

దేశీయ కార్పోరేట్‌ చరిత్రలో ఒక తైమాసికంలో అతిపెద్ద నికర నష్టాన్ని ప్రకటించిన వోడాఫోన్‌ ఐడియా షేరు శుక్రవారం మిడ్‌సెషన్‌ కల్లా తిరిగిలాభాల్లోకి మళ్లింది. ఏజీఆర్‌ ప్రభావంతో వొడాఫోన్‌ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో తమ నష్టాలు రూ.4,874 కోట్లని కంపెనీ వెల్లడించింది.

ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌.... మిట్టల్‌కు లైన్‌ క్లియర్‌!

Friday 15th November 2019

ఎస్సార్‌ స్టీల్‌ను సొంతం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఆర్సెలార్‌ మిట్టల్‌కు శుక్రవారం అనుమతినిచ్చింది. 2018 అక్టోబర్‌ 23న ప్రకటించిన ప్రణాళిక ప్రకారం మిట్టల్‌ డీల్‌పూర్తి చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఇప్పటివరకు ఈ డీల్‌పై ఉన్న స్టేను ఎత్తేసింది. విక్రయ సొత్తును ఎలా పంచుకోవలన్నది రుణదాతల కమిటీ(సీఓసీ- అంటే బ్యాంకుల కన్సార్టియం) ఇష్టమని తెలిపింది. కంపెనీని విక్రయించిన సొత్తును ఫైనాన్షియల్‌, ఆపరేషనల్‌ క్రెడిటర్లు సమానంగా పంచుకోవాలని గతంలో ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పును కొట్టేసింది.

Most from this category