News


రేట్‌ కట్‌తో భారత్‌ పెట్టుబడులకు గమ్యస్థానం- ఫిచ్‌ రేటింగ్స్‌

Saturday 21st September 2019
Markets_main1569052287.png-28470

కార్పోరేట్‌ తగ్గింపు చర్య ప్రత్యక్షంగానే ప్రభుత్వ ద్రవ్యలోటు లక్ష్యంపై ప్రభావం చూపుతుందని, కానీ పన్నుల సేకరణ పెరిగే అవకాశం ఉండడంతో ద్రవ్యలోటు ఒత్తిళ్లను అధిగమించవచ్చని ఫిచ్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్, స్నేహదీప్ బోహ్రా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..
ఆర్థికవ్యవస్థపై పాజిటివ్‌ సైన్‌..
కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం, చాలా సానుకూలమైన చర్య. దీని వలన అధిక మొత్తంలో నగదు కార్పోరేట్‌లకు అందుబాటులో ఉంటుంది. ఫలితంగా కార్పోరేట్‌ కంపెనీల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. ఈ నగదును ఏ విధంగా వినియోగిస్తారనే విషయంపై ఖచ్చితమైన ఆలోచనేలేవి లేకపోయినప్పటికి ఇందులో ఎంతో కొంత భాగం పెట్టుబడుల రూపేణా తిరిగి వ్యవస్థలోకి వచ్చే అవకాశం అధికం. ఫలితంగా ఈ చర్య ఆర్థిక వృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచుతుంది.
పన్నుల సేకరణ పెరుగుతుంది...
ట్యాక్స్‌ తగ్గింపు జరిగినప్పటికి, ప్రస్తుతం ప్రభుత్వం నిధులను ఏవిధంగా సేకరించుకుంటుందనే అంశంపై అందరికి ఆందోళనలున్నాయి. సాధరణ పద్ధతిలో చెప్పాలంటే కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రత్యక్షంగానే ప్రభుత్వ ద్రవ్యలోటు లక్ష్యంపై ప్రభావం చూపుతుంది. కానీ పన్నుల సేకరణ అధికమవుతుందనే అంచనాలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ట్యాక్స్‌ను తగ్గించడంతో, ఇండియా పెట్టుబడులకు గమ్యస్థానంగా మారే​అవకాశం ఉంది. ఫలితంగా ద్రవ్యలోటు ఒత్తిళ్లను ప్రభుత్వం తగ్గించుకోవచ్చు.



You may be interested

తెరపైకి ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలు: 18 డాలర్లు పెరిగిన పసిడి

Saturday 21st September 2019

అమెరికా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర పెరిగింది. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చలను చైనా మధ్యలోనే రద్దు చేసుకున్నట్లు కన్పిస్తోందని అమెరికా ప్రతినిధులు తెలిపారు. ఇరాన్‌ తాజాగా మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు. ఫలితంగా రాత్రి అమెరికా మార్కెట్‌ ముగిసేసరికి ఔన్స్‌ పసిడి ధర 18డాలర్ల లాభంతో 1,524.05 వద్ద  స్థిరపడింది. దీంతో సెప్టెంబర్‌లో తొలిసారిగా పసిడి ఈ

ట్యాక్స్‌ కట్‌తో భారీగా లాభపడే కంపెనీలివే!

Saturday 21st September 2019

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 22 శాతానికి (సెస్‌, సర్‌చార్జీలు కలిపి 25.17) తగ్గించి మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ చర్యకు ముందు, రూ. 400 కోట్ల వార్షిక టర్నోవర్‌ కలిగిన కంపెనీలు 30 శాతం( సెస్‌, సర్‌చార్జీలతో కలిపి 34.944 శాతం) కార్పోరేట్‌ ట్యాక్స్‌ను, టర్నొవర్‌ రూ. 400 కోట్లు లోపు ఉన్న దేశీయ కంపెనీలు 25 శాతం(సెస్‌, సర్‌చార్జీలతో కలిపి 29.12 శాతం)

Most from this category