News


30 శాతం పెరిగిన వీఐఎక్స్‌

Friday 6th September 2019
Markets_main1567793652.png-28244

బడ్జెట్‌నాటి నుంచి చూస్తే వోలటాలిటీ ఇండెక్స్‌ అయిన ఇండియా వీఐఎక్స్‌ సూచీ 30 శాతానికి పైగా పెరిగింది. అంటే సమీప కాలంలో వొలటాలిటీ (అస్థిరతలు/ఆటుపోట్లు) ఉంటుందని మార్కెట్లు అంచనా వేస్తున్నట్టు సూచీ పెరుగుదల తెలియజేస్తోంది. ఇండియా వీఐఎక్స్‌ జూలై 5న (కేంద్ర బడ్జెట్‌ రోజు) 13.06గా ఉంటే, ఈ నెల 5 నాటికి అది 17.27 స్థాయికి పెరిగిపోయింది. రెండు నెలల్లోనే 32 శాతం పెరిగింది. కానీ, ఇదే కాలంలో నిఫ్టీ 8 శాతమే తగ్గడం గమనార్హం. బడ్జెట్‌ నాడు నిఫ్టీ 11,811 వద్ద ఉండగా, ప్రస్తుతం 10,946 వద్దకు దిగొచ్చింది. 

 

ఈక్విటీ మార్కెట్లు, వీఐఎక్స్‌ ఎప్పుడూ వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తాయని చరిత్ర చెబుతోంది. అయితే, వీఐఎక్స్‌ సూచీ 13 స్థాయికి పైన ఉన్నంత వరకు అస్థిరతలు కొనసాగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ‘‘ఇండియా వీఐఎక్స్‌ వేగంగా పెరిగినా కానీ ఆగస్ట్‌ నెలలో ఒక శాతానికి తక్కవే పడిపోయింది. ఎందుకంటే మార్కెట్‌ కదలికలకు అనుగుణంగా వీఐఎక్స్‌ చలనం లేదు. ప్రస్తుత రోజుల్లో వీక్లీ ఆప్షన్ల కాంట్రాక్టుల్లో యాక్టివిటీ ఎక్కువగా ఉంటోంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ డెరివేటివ్స్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా అన్నారు. ఇండియా వీఐఎక్స్‌ 16 జోన్‌కు పైన ట్రేడ్‌ అవుతున్నందున అస్థిరతలు సెప్టెంబర్‌ నెలలోనూ కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే, వీఐఎక్స్‌ సూచీ 13 జోన్‌కు తగ్గిపోవాల్సి ఉందని, అప్పుడు స్వల్ప కాలానికి మార్కెట్‌లో స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పారు.  

 

చారిత్రకంగా నిఫ్టీ, ఇండియా వీఐఎక్స్‌ మధ్య విలోమ సంబంధం ఉంటోందని, వీఐఎక్స్‌ 13 జోన్‌కు దిగువన ఉంటేనే స్థిరత్వం ఏర్పడుతుందని నిపుణులు అంటున్నప్పటికీ.. కొందరు మాత్రం ఇతర అంశాలు కూడా దీనిపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, చమురు ధరలు, బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు, వడ్డీ రేట్ల ప్రభావం వీఐఎక్స్‌పై ఉంటాయని చెబుతున్నారు. గత నెల 13న ఇండియా వీఐఎక్స్‌ 17.78, 22న 17.85, ఈ నెల 3న 18.06 స్థాయిలను కూడా చేరడం గమనార్హం. ‘‘నిఫ్టీకి, ఇండియా వీఐఎక్స్‌ మధ్య పరస్పర సంబంధం సహజంగా ప్రతికూలంగా ఉంటుంది. కానీ, ఇదే కచ్చితమైనది కాదు. అందుకే వీఐఎక్స్‌ 30 శాతం పెరగడం, నిఫ్టీ పతనానికి సమాన స్థాయిలో లేదు’’ అని క్యాపిటల్‌ ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రొమేష్‌ తివారీ పేర్కొన్నారు. ఈక్విటీ ఇన్వెస్టర్లు ఆటో, ఫార్మా రంగాల్లో బాగా పడిపోయిన నాణ్యమైన స్టాక్స్‌ను క్రమంగా కొనుగోలు చేసుకోవాలని సూచించారు. సాధారణ పరిస్థితికి రావడానికి ముందు వోలటాలిటీ ఇండెక్స్‌ ఇంకాస్త పెరిగే అవకాశం ఉందన్నారు. 



You may be interested

ఈ స్టాక్స్‌ 50 శాతం చౌక...!

Friday 6th September 2019

నిఫ్టీ ఈ ఏడాది జూన్‌ 3న నమోదు చేసిన 12,103 రికార్డు స్థాయి నుంచి 10 శాతం వరకు పడిపోయింది. కానీ, నిఫ్టీ 500 సూచీలోని 20 స్టాక్స్‌ మాత్రం 50 శాతం అంతకంటే ఎక్కువే వాటి గరిష్ట స్థాయిల నుంచి పడిపోయి చౌక ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. మరి వీటిని కొనుగోలు చేసుకోవచ్చా..? అంటే నిపుణుల అభిప్రాయలను పరిశీలిద్దాం...   కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, సింటెక్స్‌

ట్రేడింగ్‌ బెల్స్‌ నుంచి టెక్నికల్‌ సిఫార్సులు

Friday 6th September 2019

షార్ట్‌టర్మ్‌కు 5 స్టాకులపై ట్రేడింగ్‌ బెల్స్‌ సీఈఓ అమిత్‌గుప్తా అంచనాలు ఇలా ఉన్నాయి.. 1. పీఎన్‌బీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 65. డైలీ చార్టుల్లో రివర్సల్‌ సంకేతాలు ఇస్తోంది. కచ్ఛితమైన స్టాప్‌లాస్‌(రూ.58)తో కొనుగోలు చేయవచ్చు. వారం పదిరోజుల్లో టార్గెట్‌ సాధించే ఛాన్సులున్నాయి.  2. దిలీప్‌ బుల్డ్‌కాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 420. స్టాప్‌లాస్‌ రూ. 350. దీర్ఘకాలిక చార్టుల్లో నెగిటివ్‌గా ఉన్నా, డైలీ చార్టులో చిన్నపాటి ట్రెండ్‌ రివర్సల్‌ కనిపిస్తోంది. పది రోజుల

Most from this category