News


జీడీపీ కట్‌తో మార్కెట్‌ క్రాష్‌

Friday 4th October 2019
Markets_main1570176180.png-28720

  • 2వారాల కనిష్టాన్ని తాకిన నిఫ్టీ

ఆర్‌బీఐ తాజా పాలసీలో వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ, జీడీపీ అంచనాల్ని సైతం భారీగా 6.1 శాతానికి తగ్గించడంతో శుక్రవారం మధ్యాహ్నం మార్కెట్‌ నిలువునా పతనమయ్యింది. స్టాక్‌ సూచీలు రెండు వారాల కనిష్టస్థాయికి తగ్గాయి. సెప్టెంబర్‌ మూడోవారంలో కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం జరిగిన ర్యాలీ తర్వాత...సూచీలు ఇంత దిగువస్థాయికి తగ్గడం ఇదే ప్రధమం.  నేడు జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను పావుశాతం మేర తగ్గించింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి పరిమితం చేసింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించడంతో పాటు జీడీపీ వృద్ధి అంచనాలను పరిమితం చేయడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా పాలసీ ప్రకటన అనంతరం మార్కెట్లో అమ్మకాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వడ్డీరేట్లకు ప్రభావితమయ్యే బ్యాంకింగ్‌, అటో, రియల్టీ షేర్లు తీవ్ర ఒడిదుకుడులకు లోనయ్యాయి. వాటితో పాటు మెటల్‌, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌ షేర్లలో సైతం అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు రూపాయి ప్లాట్‌ ట్రేడింగ్‌ కారణంగా డాలర్ల రూపంలో ఆదాయాల్ని ఆర్జించిన ఐటీ, సార్మా షేర్లకు స్వల్పంగా లాభాల మద్దతు లభిస్తుంది. ఇక ప్రధాన సూచీల విషయానికొస్తే... నిఫ్టీ ఇండెక్స్‌ నేటి ఇంట్రాడే గరిష్ట స్థాయి(11,400.30) నుంచి 169 పాయింట్లు నష్టపోయి 11,231.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ కనిష్టస్థాయి నిఫ్టీ రెండువారాల కనిష్టస్థాయి కావడం గమనార్హం. అలాగే సెనెక్స్‌ సైతం ఇంట్రాడే హై(38,403.54) నుంచి 539 పాయింట్లు నష్టపోయి 37,863.85 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం రివకరీ బాట పట్టిన సూచీలు మధ్యాహ్నం గం.1:15ని.లకు సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 38,015.39 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 11,265.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో పతనంలో 1.75శాతం నష్టంతో 27,914.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
మిడ్‌సెషన్‌ సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ...
అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, నెస్లే ఇండియా, బీపీసీఎల్‌, గ్రాసీం, కోటక్‌ బ్యాంక్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 2.50శాతం వరకు నష్టపోయాయి. హీరోమోటోకార్ప్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మహీంద్రాఅండ్‌మహీంద్రా, సిప్లా, ఓఎన్‌జీసీ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం వరకు లాభపడ్డాయి. 



You may be interested

మరో రేట్‌ కట్‌...విశ్లేషకుల అంచనా

Friday 4th October 2019

 రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) శుక్రవారం ఎంపీసీ(మానిటరీ పాలసీ కమిటీ) సమావేశంలో మరోదపా 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించి రెపోరేటును 5.15 శాతానికి పరిమితం చేసింది. ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన దేశ జీడీపీని తిరిగి పుంజుకునేలా చేసేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను 6.1 శాతానికి తగ్గించింది.  దీనిని చేరుకునేందుకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచి మరో 15

జీడీపీ అంచనాలను 6.1% తగ్గించిన ఆర్‌బీఐ; 25 బీపీఎస్‌ రేట్‌ కట్‌

Friday 4th October 2019

  ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)  పాలసీ సమీక్షలో భాగంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతానికి పరిమితం చేసింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎంపీసీ వ్యవహరిస్తుందని ఆర్‌బీఐ పాలసీ కమిటీ తెలిపింది. ఎంపీసీ సభ్యులందరూ పాలసీ రెపో రేటును తగ్గించడానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ

Most from this category