STOCKS

News


ఐదేళ్లలో 47 బిలియన్‌ డాలర్ల సమీకరణ!

Saturday 13th July 2019
Markets_main1562957659.png-27026

ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం రూపంలో వచ్చే ఆదాయంపై కేంద్ర ‍ప్రభుత్వం ఆధారపడడం అంతకంతకూ పెరిగిపోతోంది. వచ్చే ఐదేళ్ల కాలలో ఏకంగా 47.4 బిలియన్‌ డాలర్లను (రూ.3.25 లక్షల కోట్లు) సమీకరించాలన్నది మోదీ సర్కారు ప్రణాళిక. ప్రభుత్వరంగ బ్లూచిప్‌ కంపెనీల్లో 40 శాతానికి వాటాలు తగ్గించుకోవడం ద్వారా పెద్ద ఎత్తున నిధులను సమీకరించుకోనుంది. రెండు దశాబ్దాల కాలంలో కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద ప్రైవేటైజేషన్‌గా దీన్ని పరిగణిస్తున్నారు. కొన్ని ప్రభుత్వరంగ కంపెనీల్లో ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణను తగించుకోవాలనుకుంటున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్లో ప్రకటించిన విషయం గమనార్హం. 

 

బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలతో ప్రభుత్వరంగ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం ఏర్పడినట్టే. మరోవైపు ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉండేందుకు ఈ నిధులు అక్కరకు వస్తాయి. మోదీ సర్కారు మొదటి ఐదేళ్ల పాలలనో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఇప్పటికే 40.92 బిలియన్‌ డాలర్ల నిధులను రాబట్టుకుంది. అంతకుముందు ఐదేళ్ల యూపీఏ-2 హయాంలో 14.52 బిలియన్‌ డాలర్ల మేర ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం జరిగింది. దాంతో పోలిస్తే మోదీ సర్కారు మూడు రెట్లు అధికంగా అమ్మకాలు సాగించింది. రెండో సారి మోదీకే ప్రజలు పట్టం కట్టడం, ప్రభుత్వం ముందు భారీ లక్ష్యాలు ఉండడతో ఈ వాటాల అమ్మకాల క్రతువు యధేచ్చగా కొనసాగనుంది. 

 

ప్రభుత్వం వాటాల అమ్మకానికి పాడి ఆవుల్లాంటి సంస్థలను ఇప్పటికే గుర్తించింది. ఓఎన్‌జీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, గెయిల్‌ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌టీపీసీ, ఎన్‌ఎండీసీ, కోల్‌ ఇండియా, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ ఈ జాబితాలో ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. ‘‘ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కించి చూసినప్పుడు, ప్రభుత్వరంగ కంపెనీల్లో (బ్యాంకులు మినహా) ప్రభుత్వం తన వాటాను 40 శాతానికి తగ్గించుకోవడం ద్వారా రూ.3.25 లక్షల కోట్లు సమకూరతాయి’’ అని ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి ముఖ్యమని, దాన్ని బట్టే వాటాల విక్రయం సమయం ఆధారపడి ఉంటుందన్నారు. 

 

ప్రభుత్వం ఇన్వెస్టర్ల ఆసక్తిని గమనించి, తగిన కాల వ్యవధిని, అది కూడా కమోడిటీ సైకిల్‌కు సరిపోయే విధంగా నిర్ణయించాలని గ్లోబల్‌ మెటల్స్‌, మైనింగ్‌ ఈక్విటీ కన్సల్టెంట్‌ సత్యదీప్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. కోల్‌ ఇండియా వంటి కంపెనీల్లో వాటాల విక్రయానికి ముందు ప్రభుత్వం వేచి చూడాలని, అంతర్జాతీయంగా బలహీన ధరలు, ఈ కంపెనీ షేర్ల డిమాండ్‌కు విఘాతం కలిగించొచ్చన్నారు. దీనికి బదులు ఈ ఏడాది మంచి జోరులో ఉన్న ఎన్‌ఎండీసీ వాటాల విక్రయానికి మంచి లక్ష్యం కాగలదన్నారు.You may be interested

పన్నుల తగ్గింపునకు ఎఫ్‌పీఐల లాబీ యత్నాలు

Saturday 13th July 2019

కేంద్ర బడ్జెట్‌లో అధిక ఆదాయ వర్గాల (సంపన్నులు) వారిపై ప్రభుత్వం ఆదాయపన్ను సర్‌చార్జీని పెంచేయడం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లనూ (ఎఫ్‌పీఐ) ఆందోళనకు గురి చేస్తోంది. దీని ప్రభావమే బడ్జెట్‌ రోజు, ఆ తర్వాత ట్రేడింగ్‌ సెషన్‌లోనూ మార్కెట్లు భారీగా నష్టాలపాలవడం. ఎఫ్‌పీఐలు పెరిగిన పన్నుల భారాన్ని చూసి అమ్మకాలు దిగారన్నది విశ్లేషకుల అంచనా. అయితే, ఎఫ్‌పీఐలనే ఉద్దేశించి సర్‌చార్జీ పెంచలేదని, అధిక ఆదాయ వర్గాలు అందరికీ వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం

ఇన్ఫోసిస్‌ లాభం రూ. 3800 కోట్లు

Friday 12th July 2019

జూన్‌ త్రైమాసికానికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ. 3798కోట్ల నికరలాభం ప్రకటించింది. కంపెనీ రెవెన్యూ రూ. 21,803 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వృద్ధి అంచనాలను 7.5-9.5 శాతం నుంచి 8.5- 10.5 శాతానికి పెంచింది. కంపెనీ ఎబిటా 4431 కోట్ల రూపాయలుగా, ఎబిటా మార్జిన్‌ 20.5 శాతంగా నమోదు చేసింది. ఎబిటా మార్జిన్‌ గైడెన్స్‌ను 21- 23 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మార్కెట్‌

Most from this category