News


ఇండియా వెయిట్‌ను తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 4th September 2019
Markets_main1567594065.png-28191

దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడంతో మోర్గాన్‌ స్టాన్లీ ఆసియా బ్యాంకుల పోర్టుపోలియోలో ఇండియా వెయిట్‌ను 8 పాయింట్ల తగ్గించినట్టు మోర్గాన్‌ స్టాన్లీ ఓ నివేదికలో పేర్కొంది. గతంలో ఈ పోర్టుపోలియోలో ఇండియా వెయిట్‌ 25 శాతం ఉం‍డగా తాజా కోతతో అది 17.5 శాతానికి పడిపోయింది. ఇండియాకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు మోర్గాన్‌ స్టాన్లీ ఆసియా బ్యాంక్స్‌ పోర్టుపోలియోలో ఉండగా, దీని నుంచి ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ను తొలగించి, ఐసీఐసీఐ బ్యాంక్‌ వెయిట్‌ను 12.5 శాతం నుంచి 10 శాతానికి ఈ బ్రోకరేజి తగ్గించింది. ఈ పోర్టుపోలియోలో హెచ్‌డీఎఫ్‌సీ వెయిట్‌ 7.5 శాతాన్ని మార్చకపోవడం గమనార్హం. 
   మోర్గాన్‌ స్టాన్లీ ఆసియా బ్యాంక్‌ పోర్టుపోలియోలో ఇతర దేశాలకు చెందిన బ్యాంకుల స్టాకులు కూడా వాటి దేశాలలో ఆర్థిక వ్యవస్థ మందగమనాల వలన తీవ్రంగా నష్టపోయాయని మోర్గాన్‌స్టాన్లీ నివేదికలో తెలిపింది. హాంగ్‌ కాంగ్‌, థాయ్‌లాండ్‌, కొరియా, ఇండియా దేశాల బ్యాంకులు అధ్వాన్నమైన ప్రదర్శనను చేశాయని, ఇండియాలో బ్యాంకుల స్టాకులు భారీగా నష్టపోయాయని తెలిపింది. బ్యాంక్‌ పేర్లను బయటపెట్టకుండా క్రెడిట్ ఖర్చులు బాగానే ఉండడంతో వీటి ఈపీఎస్‌(షేరుపై లాభం)లో అతిగా మార్పు ఉండదని, ఆర్థిక ‍వ్యవస్థ బలహీనత కొనసాగితే రుణ ఖర్చులు పెరుగుతాయని ఇది ఈపీఎస్‌ తగ్గడానికి కారణంమవుతుందని తెలిపింది. ఈ సమస్య హాంగ్‌ కాంగ్‌, ఇండియాలో అధికంగా ఉంటుందని, ఇండియాలో కార్పోరేట్‌, మైక్రో,చిన్న,మధ్యతరహా కంపెనీలకు రుణాల కొరత తీవ్రమవ్వొచ్చని  మోర్గాన్‌ స్టాన్లీ హెచ్చరించింది.



You may be interested

ఎల్‌ఐసీ పోర్టుపోలియోలో రాణించిన స్టాకులివే!

Wednesday 4th September 2019

గత కొన్ని సెషన్‌ల నుంచి దేశియ మార్కెట్లో పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి వలన దేశియంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌యిన లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) పోర్టుపోలియోలోని 80 శాతానికి పైగా స్టాకులు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. కానీ ప్రస్తుత బేరిష్‌  మార్కెట్‌ దృక్పథాన్ని తట్టుకొని కూడా ఎల్‌ఐసీ పోర్టుపోలియోలో కొన్ని స్టాకులు అద్భుత పదర్శనను చేశాయి.     ఈ పోర్టుపోలియోలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ) అయిన షిప్‌బిల్డింగ్‌ సంస్థ గార్డెన్‌ రీచ్‌

లాభాల ముగింపు

Wednesday 4th September 2019

జాతీయ, అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో ముగిసింది. ముఖ్యంగా మిడ్‌సెషన్‌ అనంతరం జరిగిన కొనుగోళ్లతో సెనెక్స్‌ 162 పాయింట్లు పెరిగి 36,724 వద్ద, నిఫ్టీ 46.75 పాయింట్ల లాభంతో 10,844.65 వద్ద స్థిరపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 9నెలల కనిష్టం నుంచి రికవరి, నిన్న సూచీల భారీ పతనం నేపథ్యంలో వ్యాల్యూ షేర్లకు కనిష్టస్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడటంతో అవి పెరిగాయి. హాంకాంగ్‌లో కొద్దిరోజులుగా

Most from this category