News


దమానీ పోర్టుఫోలియోలో షేర్లివే!

Wednesday 12th February 2020
Markets_main1581504238.png-31733

అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ షేరు ర్యాలీతో దమానీ దేశంలో ఆరో అతిపెద్ద కుబేరుడుగా అవతరించాడు. ఈ మార్ట్స్‌ ఆరంభానికి ముందే ఆయన ఒక వాల్యూ ఇన్వెస్టర్‌గా సుపరిచితుడు. ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా సైతం దమానీని తన గురువుగా పేర్కొంటాడంటే, ఇన్వెస్టర్‌గా ఆయన ప్రఖ్యాతి అంచనా వేయొచ్చు. మొదటి నుంచి హైక్వాలిటీ స్టాకుల ఎంపికలో దమానీకి మంచిపేరుంది.

అలాంటి దమానీ పోర్టుఫోలియోలో ఉన్న షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి...
= అవెన్యూసూపర్‌ మార్ట్స్‌లో దమానీకి 37.19 శాతం వాటా, ఆయన కుటుంబం, ట్రస్టు తదితరాలన్నింటికీ కలిపి 79.73 శాతం వాటా ఉంది. 
= గత డిసెంబర్‌ చివరకు ఆయనకు డెల్టా కార్‌‍్ప, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా, ద ఇండియా సిమెంట్స్‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, ఫుడ్స్‌ అండ్‌ ఇన్స్‌, స్పెన్సర్స్‌ రిటైల్‌లో దాదాపు ఒక్క శాతం కన్నా ఎక్కువ వాటా ఉంది. 
= సెప్టెంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌ త్రైమాసికానికి డెల్టాకార్‌‍్పలో ఆయన వాటా 1.53 శాతం నుంచి 1.32 శాతానికి పడిపోయింది. 
= ఇండియా సిమెంట్స్‌లో వాటాను ఈ కాలంలో 1.3 శాతం నుంచి 4.73 శాతానికి పెంచుకున్నారు. 
దమానీ పోర్టుఫోలియోను చూసి అనుకరించాలనుకునే వాళ్లు ఆయన మైండ్‌సెట్‌ను,స్టైల్‌ను అనుకరించాలని అదంత ఈజీ కాదని ఇంటెల్‌సెన్స్‌ క్యాపిటల్‌ అనలిస్టు అభిషేక్‌ చెప్పారు. ఇన్వెస్టర్లు ఎవరికివారు సొంత విశ్లేషణ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. బడా ఇన్వెస్టర్లను కేవలం కాపీ కొట్టడంతో సక్సెస్‌ రాదని, తమకు తగ్గట్లు పెట్టుబడి ప్రణాళికలను రూపొందించుకుంటేనే విజయం వరిస్తుందని మరో ప్రముఖ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా సూచించారు. You may be interested

8.3 శాతం క్షీణించనున్న వాహన ఉత్పత్తులు!

Wednesday 12th February 2020

పిచ్‌ అంచనా చైనా దేశాన్ని ఆర్థికంగా కుదిపేసిన కరోనావైరస్‌ భారత వాహన రంగంపై  ప్రభావాన్ని చూపనుంది. కరోనా వైరస్‌ కారణంగా మన దేశంలో  వాహన రంగంలోఉత్పత్తులు పడిపోయే అవకాశం ఉందని పిచ్‌ అంచనా వేసింది. గతేడాది 13.2 శాతంగా ఉన్న ఉత్పత్తి ఈ ఏడాది 8.3 శాతానికి క్షీణించవచ్చని తెలిపింది. ముఖ్యంగా భారత్‌లో తయారయ్యే వాహనాలకు  విడిభాగాలు అధికంగా చైనా నుంచే సరఫరా అవుతుండడమే ఇందుకు కారణమని తెలిపింది. చైనాలో కరోనా

సెన్సెక్స్‌ ట్రిపుల్‌ - 2 వారాల గరిష్టం

Wednesday 12th February 2020

నిఫ్టీ 93 పాయింట్లు ప్లస్‌ రెండు వారాల గరిష్టానికి మార్కెట్లు ఎఫ్‌ఎంసీజీ జూమ్‌ వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపాయి. సానుకూల ప్రపం‍చ సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు తదుపరి మరింత జోరందుకున్నాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఏదశలోనూ వెనుదిరిగి చూడలేదు. వెరసి రెండు వారాల గరిష్టానికి చేరాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లు జంప్‌చేసి 41,566 వద్ద నిలవగా.. నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 12,201

Most from this category