News


వర్థమాన మార్కెట్లలో భారత్‌ భేష్‌

Wednesday 5th February 2020
Markets_main1580884126.png-31526

త్వరలోనే ఆర్థిక పురోభివృద్ధి!
మోర్గాన్‌ స్టాన్లీ తాజా అంచనాలు

వర్ధమాన మార్కెట్లలోకెల్లా భారత్‌ మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని విదేశీ రీసెర్చ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా పేర్కొంది. గత కొంతకాలంగా కార్పొరేట్‌ ఫలితాలు, ఆర్థిక వ్యవస్థ మందగమన సమస్యలు ఎదుర్కొంటున్న భారత్‌ త్వరలోనే వృద్ధి బాట పట్టగలదని అంచనా వేసింది. దీంతో దేశీ మార్కెట్లకు ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషకులు జోనాథన్‌ గార్నర్‌ తెలియజేశారు. మోర్గాన్‌ స్టాన్లీలో ఏషియా, ఎమర్జింగ్‌ మార్కెట్ల ఈక్విటీ వ్యూహకర్త(చీఫ్‌)గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తు‍న్నారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గార్నర్‌ మార్కెట్లు, సైక్లికల్స్‌ తదితర అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

సైక్లికల్స్‌కు చోటు
త్వరలో ఇండియా వృద్ధి బాటపట్టనుంది. ఇతర వర్ధమాన మార్కెట్లకంటే మెరుగైన రిటర్నులు ఇచ్చే వీలుంది. దీంతో ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ఇస్తున్నాం. పోర్ట్‌ఫోలియోలో కొన్ని సైక్లికల్స్‌కు చోటు ఇవ్వవచ్చు. ప్రధానంగా ఇండస్ట్రియల్‌, కన్జూమర్‌ సైక్లికల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మేలు. అయితే ఇతర వర్ధమాన మార్కెట్లలో కనిపిస్తున్న ట్రెండ్‌కు ఇవి విరుద్ధం. బ్రెంట్‌ చమురు ధరలు కనిష్ట స్థాయిలవద్ద కొనసాగితే.. దేశానికి లబ్ది చేకూరుతుంది. దీనికితోడు దేశీ అంశాలు సైతం ఆర్థిక రికవరీకి దోహదం చేయనున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ కొంతమేర రిస్క్‌లను పెంచుతోంది. ఉత్తర ఆసియాలో చైనా తదితర మార్కెట్లపై ఈ ప్రభావం అధికంగా పడనుంది. 



You may be interested

ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌ అంటున్న బ్రోకరేజ్‌లు!

Wednesday 5th February 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో అంచనాలను అందుకోలేకపోయినా.. భారతీ ఎయిర్‌టెల్‌పై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌ ధోరణినే కొనసాగిస్తున్నాయి. క్యు3లో కంపెనీ రూ. 1035 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. త్వరలో మరిన్ని టారిఫ్‌ పెంపుదలలుంటాయని కంపెనీ సీఈఓ సంకేతాలు ఇచ్చారు. భవిష్యత్‌ టెక్నాలజీలపై వ్యయాలకోసం టారిఫ్‌లు పెంచకతప్పదన్నారు. దీంతో రాబోయే రోజుల్లో కంపెనీ బాలెన్స్‌ షీట్‌ మెరుగుపడుతుందన్న అంచనాలతో బ్రోకింగ్‌ సంస్థలు భారతీ ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌గా ఉన్నాయి. = యూబీఎస్‌ సంస్థ ఎయిర్‌టెల్‌కు కొనొచ్చు రేటింగ్‌ను ఇచ్చింది.

లాభాల్లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు: అరశాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 5th February 2020

మార్కెట్లో బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు 1శాతం(287 పాయింట్లు) పెరిగింది.  మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్‌ రంగ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తిచూపారు. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఒకదశలో 0.84శాతం(287 పాయింట్లు) పాయింట్ల పెరిగి 30,945.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు (30,686.70)తో

Most from this category