News


వేలానికి 23చమురు బ్లాక్‌లు

Monday 11th February 2019
Markets_main1549867906.png-24130

  • ఓఏఎల్‌పీ మూడో విడత ప్రారంభం
  • 700 మిలియన్ డాలర్ల పెట్టుబడుల అంచనా
  • బిడ్డింగ్‌కు ఏప్రిల్ 10 గడువు
  •  చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి

గ్రేటర్ నోయిడా: ఓపెన్ ఎక్రేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద మూడో విడతలో కేంద్రం 23 చమురు, గ్యాస్, సీబీఎం బ్లాక్‌ల వేలం వేస్తోంది. దీనితో ఈ రంగంలోకి 600-700 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు రావొచ్చని భావిస్తోంది. ఆదివారమిక్కడ పెట్రోటెక్ 2019 సదస్సులో ఓఏఎల్‌పీ మూడో రౌండును ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా ఇంధన ఉత్పత్తి పెంచేందుకు, దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఇది తోడ్పడగలదని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. మూడో విడతలో అయిదు కోల్‌ బెడ్ మీథేన్ బ్లాక్‌లు కూడా ఉన్నాయని, మొత్తం 31,000 చ.కి.మీ. మేర అన్వేషణ ప్రాంతం విస్తరించి ఉంటుందని మంత్రి చెప్పారు. బిడ్డింగ్‌కు ఏప్రిల్ 10 ఆఖరు తేదీగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన ఓఏఎల్‌పీ రెండో విడతకు సమాంతరంగా మూడో విడత బిడ్డింగ్‌ కూడా జరుగుతుందని ఆయన వివరించారు.
    రెండో విడత కింద 29,333 చ.కి.మీ. విస్తీర్ణంలో 14 బ్లాక్‌లను వేలం వేస్తుండగా, మార్చి 12 బిడ్డింగ్‌కు ఆఖరు తేదీగా ఉంది. దీని ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా. ప్రస్తుతం లైసెన్సులు జారీ కాని ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చన్న అంచనాలు ఉన్న పక్షంలో ఆయా ప్రాంతాల కోసం ఓఏఎల్‌పీ కింద ఏడాది పొడవునా కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటన్నింటినీ పరిశీలించాకా కేంద్రం ఏటా రెండు సార్లు ఆయా ప్రాంతాలను బ్లాక్‌ల కింద వేలం వేస్తోంది.

సంక్లిష్ట క్షేత్రాల్లో ఉత్పత్తికి ప్రోత్సాహకాలు..
ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా సంస్థలు దాదాపు 12 సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి కూడా గ్యాస్ ఉత్పత్తి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ప్రస్తుతం నిర్దేశిత రేటు గిట్టుబాటు కాకపోవడంతో ఈ క్షేత్రాల నుంచి ఆయా సంస్థలు ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించడం లేదని పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, ముంబైలో ఓఎన్‌జీసీకి ఉన్న సంక్లిష్ట క్షేత్రాల్లో 35 బిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) నిక్షేపాలు ఉన్నట్లు అంచనా.

ఇంటింటికీ వంట గ్యాస్‌..
ప్రతీ ఇంటికి వంట గ్యాస్ కనెక్షన్‌ అందించడంపై కేంద్రం కృషి చేస్తోందని ప్రధాన్ చెప్పారు. గడిచిన 55 నెలల్లో ఎల్‌పీజీ కనెక్షన్ల కవరేజీని 40 శాతం మేర పెంచడంతో ప్రస్తుతం ఇది మొత్తం 90 శాతానికి చేరిందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద 2020 మార్చి 31 నాటికి మొత్తం 8 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించనున్నామన్నారు. 2016 మే 1న ఈ పథకం ప్రారంభించినప్పట్నుంచి ఇప్పటిదాకా 6.4 కోట్ల కనెక్షన్లు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.You may be interested

36,840 దిగువన డౌన్‌ట్రెండ్‌

Monday 11th February 2019

మార్కెట్‌ పంచాంగం 36,480 దిగువన డౌన్‌ట్రెండ్‌ నాలుగు నెలల నుంచి అవరోధం కల్పిస్తున్న సాంకేతిక స్థాయిల్ని గత వారం భారత్‌ సూచీలు విజయవంతంగా అధిగమించినప్పటికీ, అంతర్జాతీయ ట్రెండ్‌ బలహీనత కారణంగా  కేవలం రెండు రోజుల్లోనే మళ్లీ ఆ స్థాయిల్ని సెన్సెక్స్‌, నిఫ్టీలు వదులుకోవడం ఇన్వెస్టర్లను ఆందోళనపర్చే అంశం. యూరోజోన్‌ వృద్ధి మందగిస్తుందంటూ యూరోపియన్‌ యూనియన్‌ చేసిన హెచ్చరిక, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సఫలంకావేమోనన్న భయాలు గత వారాంతంలో ప్రపంచ సూచీల అప్‌ట్రెండ్‌కు బ్రేక్‌వేశాయి.

ఎంఅండ్‌ఎం షేరును ఏం చేద్దాం?

Monday 11th February 2019

డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం ఎంఅండ్‌ఎం షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల ధృక్పథం ఇలా ఉంది... 1. డాయిష్‌ బ్యాంకు: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ ధరను రూ. 850 నుంచి రూ. 815కు తగ్గించింది. రాబోయే మూడు సంవత్సరాలకు ఎబిటా అంచనాలను వరుసగా 8, 7, 4 శాతానికి తగ్గించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌ అంచనాను మాత్రం 12 శాతం పెంచింది. 2. జేపీ మోర్గాన్‌: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ.

Most from this category